Air India Flights: ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. వచ్చేవారంలో కంపెనీ కొత్తగా 20 విమానాలు ప్రారంభిస్తోంది. లండన్, బర్మింగ్‌హోమ్, శాన్‌ఫ్రాన్సిస్కోలకు మరిన్ని కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
విదేశీ ప్రయాణాలు చేసేవారికి గుడ్‌న్యూస్. విదేశీ ప్రయాణం ఇకపై మరింత ఈజీ కానుంది. ఎయిర్ ఇండియా వచ్చేవారంలో దేశంలో కొత్తగా 20 విమానాలు ప్రారంభించనుంది. రానున్న మూడు నెలల్లో బర్మింగ్‌హోమ్, లండన్, శాన్‌ఫ్రాన్సిస్కోలకు 20 అదనపు విమానాలు నడపనుంది. టాటా ఆధీనమైన ఎయిర్‌లైన్స్ ఇప్పుడు అంతర్జాతీయ విమానయానాన్ని పటిష్టం చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగానే విమాన సర్వీసులు ప్రారంభిస్తోంది.
ఎయిర్ ఇండియా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. కంపెనీ వచ్చేవారం 20 కొత్త విమానాలు ప్రారంభిస్తోంది. వారంలో బర్మింగ్‌హోమ్ కోసం 5 అదనపు విమానాలు, లండన్‌కు 9 అదనపు విమానాలు, శాన్‌ఫ్రాన్సిస్కోకు 6 అదనపు విమానాలు నడపనుంది. దీంతోపాటు ప్రతి వారం 5 వేలకంటే అదనంగా సీట్లు పెరగనున్నాయి.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా బ్రిటన్‌కు ప్రతివారం 34 విమానాలు నడుపుతోంది. కంపెనీ చేసిన ఈ ప్రకటన తరువాత విమానాల సంఖ్య పెరిగి 48 కానుంది. 7 భారతీయ నగరాల్నించి బ్రిటన్ రాజధానికి ఎయిర్ ఇండియా నేరుగా విమానాలు నడపనుంది. మరోవైపు అమెరికాకు 34 విమానాలు ప్రతి వారం నడుస్తుండగా..ఇప్పుడు పెరిగి 40 కానున్నాయి.
Also read: RBI Rate Hike: EMIలు కట్టే వారికి షాక్.. వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook