Adani Group: అదానీకి తగ్గని కష్టాలు.. ఈరోజు కూడా నాలుగు కంపెనీల షేర్ల దెబ్బ!

Gautam Adani Net Worth: భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కష్టాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు, ఆయన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఏకంగా 22వ స్థానానికి దిగాజరినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 6, 2023, 03:30 PM IST
Adani Group: అదానీకి తగ్గని కష్టాలు.. ఈరోజు కూడా నాలుగు కంపెనీల షేర్ల దెబ్బ!

Adani Group: భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కష్టాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. అమెరికన్ పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక అదానీకి చేసిన నష్టం ఇప్పటికీ కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్‌లో వారంలో మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం, అదానీ గ్రూప్‌కు చెందిన నాలుగు షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకగా, షేర్లలో కొనసాగుతున్న పతనం కారణంగా, అవి ప్రపంచ బిలియనీర్ల జాబితాలో నిరంతరం కిందికి పోతున్నాయి.

ఇక ఈ వార్త రాసే సమయానికి గౌతమ్ అదానీ ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో 22వ స్థానానికి పడిపోయాడు. జనవరి 24, 2023న అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ పరిశోధనా నివేదికను ప్రచురించినప్పటి నుండి షేర్లను తాకిన సునామీ ఇప్పటికీ కొనసాగుతోంది. నేటికీ, అదానీకి చెందిన 4 షేర్లు స్టాక్ మార్కెట్‌లో లోయర్ సర్క్యూట్‌లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ 5.12 శాతం పడిపోయి రూ. 1,505.55 స్థాయిలో ట్రేడవుతోంది, ఇక సోమవారం లోయర్ సర్క్యూట్‌ను తాకిన షేర్లలో అదానీ పవర్ లిమిటెడ్ 5% క్షీణించి రూ.182.35 వద్ద, అదానీ విల్మార్ లిమిటెడ్ 5% తగ్గి రూ.379.95, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 5% తగ్గి రూ.889.10, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ 5% పడిపోయాయి.

గౌతమ్ అదానీ హిండెన్‌బర్గ్ నివేదిక ప్రచురించిన తర్వాత అతిపెద్ద నష్టాన్ని చవిచూసి ఇబ్బందులు పడుతున్నారు. 2022 సంవత్సరంలో, సంపాదన పరంగా, ఆయన ప్రపంచంలోని ధనవంతులందరినీ వెనక్కు నెట్టి ముందుకు వెళ్లగా అతను 2022లో ఒక సంవత్సరంలో సంపాదించినది అంతా 2023లో 13 రోజులలో కోల్పోయాడు. అదానీ కంపెనీల షేర్లలో కొనసాగుతున్న పతనం కారణంగా ఇప్పుడు అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ కూడా సగానికి పడిపోయింది.

ఇక ధనవంతుల జాబితాలో చాలా దిగువకు పడిపోయిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల నిరంతర పతనం కారణంగా గౌతమ్ అదానీ సంపద కూడా అదే స్థాయిలో క్షీణిస్తోంది . ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. 2023 సంవత్సరం ప్రారంభంలో, గౌతమ్ అదానీ టాప్-10 బిలియనీర్ల జాబితాలో నాల్గవ స్థానంలో ఆధిపత్యం చెలాయించగా, ఇప్పుడు కొద్ది రోజుల్లో, అతను ఈ జాబితాలో 22 స్థానానికి పడిపోయారు. 

Also Read: Adani Group: అదానీ గ్రూప్‌ను ముంచేసిన హిండెన్‌బర్గ్ ఎలా సంపాదిస్తుందో తెలుసా

Also Read: PF Rules: పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News