Aadhaar Card Update For Free: ఆధార్ కార్డు అప్డేట్ కోసం వెళ్తే జేబుకు చిల్లు పడుతోందే అని దిగాలు పడుతున్న వారికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డుపై వివరాలను అప్డేట్ చేయడానికి ఇక డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని UIDAI స్పష్టంచేసింది. ఆధార్ అప్డేట్ కోసం చార్జ్ చేసే రుసుమును రద్దు చేస్తున్నట్టు ఆధార్ ప్రాధికారిక సంస్థ ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే వారికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని.. ఒకవేళ మీరే స్వయంగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి నేరుగా అప్డేట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టయితే.. వారు యధావిధిగా రూ.50 చెల్లించాల్సి ఉంటుందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ వెల్లడించింది.
ఎప్పటి వరకు ఈ ఉచిత సౌకర్యం అందుబాటులో ఉంటుందంటే..
ఆధార్ కార్డుహోల్డర్స్ మూడు నెలల పాటు ఉచిత ఆధార్ అప్డేట్ సౌకర్యం పొందవచ్చని UIDAI స్పష్టంచేసింది. ఆధార్ కార్డు హోల్డర్లు తమ ఆధార్ కార్డ్‌ని మార్చి 15, 2023 నుండి జూన్ 14, 2023 వరకు ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది.
Keep Demographic Details Updated to Strengthen Your #Aadhaar.
If your Aadhaar had been issued 10 years ago & had never been updated - you may now upload Proof of Identity & Proof of Address documents online at https://t.co/4k2YjTvwMe ‘FREE OF COST’ from 15 March - June 14, 2023. pic.twitter.com/0Lx1LNxZzE
— Aadhaar (@UIDAI) March 15, 2023
ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్.. ఆఖరి గడువు ఎప్పుడంటే.
ఇదిలావుంటే, ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయాలని కేంద్రం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 2023, మార్చి 31 ని కేంద్రం చివరి తేదీగా ప్రకటించింది. ఆలోగా తమ ఆధార్ కార్డును, పాన్ కార్డుతో లింక్ చేసుకోని వారికి, పాన్ కార్డు డియాక్టివేట్ అవడంతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టంచేసింది. అంతేకాకుండా గత 10 సంవత్సరాలుగా ఆధార్ కార్డుపై ఎలాంటి అప్డేట్ చేసుకోని వారు తమ ఆధార్ కార్డును విధిగా అప్డేట్ చేసుకోవాలని UIDAI పిలుపునిచ్చింది. ఆధార్ ఫ్రీ అప్డేట్ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్విటర్ ద్వారా స్పష్టంచేసింది.
ఇది కూడా చదవండి : AE Exams 2023 Cancelled: టిఎస్పీఎస్సీ కీలక నిర్ణయం.. ఏఈ పరీక్ష రద్దు
ఇది కూడా చదవండి : Cheap And Best 7 Seater Cars: మారుతి ఎర్టిగా కారుకి పోటీగా మరో మూడు 7 సీటర్ కార్లు
ఇది కూడా చదవండి : RRR Stars : ఆస్కార్ తరువాత విశ్వక్ ఈవెంట్లో ఎన్టీఆర్.. మోడీ ఈవెంట్లో చరణ్.. మరో కొత్త రచ్చ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK