Pan Aadhaar Link: మీ పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేశారో లేదో గుర్తు లేదా, ఇలా చెక్ చేసుకోండి

Pan Aadhaar Link: పాన్‌కార్డు -ఆధార్ కార్డు అనుసంధానానికి మరో మూడ్రోజులే గడువు ఉంది. నిర్ణీత గడువు మార్చ్ 31లోగా లింక్ చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. మరి మీ పాన్‌కార్డును ఆధార్ కార్డులో లింక్ చేశారో లేదో గుర్తు లేకపోతే..ఇలా చెక్ చేయండి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2023, 12:23 PM IST
Pan Aadhaar Link: మీ పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేశారో లేదో గుర్తు లేదా, ఇలా చెక్ చేసుకోండి

Pan Aadhaar Link: ఇన్‌కంటాక్స్ చట్టం 1961 ప్రకారం పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం తప్పనిసరి. ఇప్పటికే పలుమార్పు గడువు తేదీ పెంచిన ప్రభుత్వం ఈసారి మార్చ్ 31 నిర్ణయించింది. మరి మీరు మీ పాన్‌కార్డు-ఆధార్ కార్డుతో అనుసంధానం చేశారా లేదా గుర్తు లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు. సులభంగా చెక్ చేసుకోవచ్చు.

చాలామందికి పాన్‌కార్డును ఆధార్ కార్డులో లింక్ చేశారో లేదో గుర్తుండకపోవచ్చు. దీనికోసం స్టేటస్ చెక్ ఆప్షన్ ఉంది. ఇన్‌కంటాక్స్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేస్తే కన్పిస్తుంది. అప్పటికే లింక్ చేసుంటే ఆధార్ నెంబర్ కన్పిస్తుంది. లేదంటే 1000 రూపాయలు జరిమానా చెల్లించి ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. 

జరిమానా ఎలా చెల్లించాలి

ఆధార్ కార్డుతో పాన్‌కార్డును అనుసంధానం చేయాలంటే ముందు జరిమానా 1000 రూపాయలు చెల్లించాలి. ఇన్‌కంటాక్స్ వెబ్‌సైట్ లేదా ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. https://www.incometax.gov.in/iec/foportal/ పోర్టల్ ఓపెన్ చేసి ఈ పే ట్యాక్స్ క్లిక్ చేసి రెండు సార్లు మీ పాన్‌కార్డు నెంబర్ ధృవీకరించాలి. ఆ తరువాత మీ ఫోన్ నెంబర్ నమోదు చేయాలి. మీ ఫోన్‌కు వచ్చే ఓటీటీ ఎంటర్ చేస్తే వెరిఫికేషన్ పూర్తయ్యాక పేమెంట్ ఆప్షన్ కన్పిస్తుంది. పేమెంట్ పూర్తి చేసిన 4-5 రోజులకు ఐటీ శాక ఈ ఫైలింగ్ వెబ్ సైట్‌లో వెళ్లి లింక్ ఆధార్‌తో పాన్‌కార్డును లింక్ చేయవచ్చు.

పాన్‌కార్డు ఆధార్ కార్డు లింక్ చేయకపోతే

మీ పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు డీయాక్టివేట్ అయిపోతుంది. దాంతో బ్యాంక్ ఎక్కౌంట్, డీ మ్యాట్ ఎక్కౌంట్ తెరవడం సాధ్యం కాదు. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి నిబంధనలు అడ్డొస్తాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేరు. 

Also read: Jio plans for ipl 2023: అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌తో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసే అవకాశం, నెలకు 198 రూపాయలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News