7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్, పెరగనున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు ఖరారైంది. ఉద్యోగుల జీతం ఇకపై భారీగా పెరగనుంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 8, 2022, 04:02 PM IST
7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్, పెరగనున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై నిర్ణయం వెలువడనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే..ఉద్యోగుల కనీస బేసిక్ శాలరీ పెరగనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్ట్రర్ ఎంత పెరగనుంది..జీతం ఎంత పెరుగుతుందనే వివరాలు పరిశీలిద్దాం..

ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై నిర్ణయం తీసుకోనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 3.68 శాతానికి పెంచితే బేసిక్ శాలరీ 8 వేల వరకూ పెరగనుంది. ముందుగా డ్రాఫ్ట్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం ఆమోదం లభిస్తే..52 లక్షల కంటే ఎక్కువమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ శాలరీలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరగనుంది.

ప్రభుత్వ ఇటీవలే ఉద్యోగుల డీఏను పెంచింది. ఆ తరువాత ఉద్యోగులకు జూలై నెల నుంచి పెరిగిన డీఏను అందించింది. ఇప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో మార్పు వస్తే ఉద్యోగుల మొత్తం శాలరీపై ప్రభావం కన్పిస్తుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ విషయంలో ఈనెలలోనే సమావేశం ఏర్పాటుకానుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు విషయమై దీర్ఘకాలంగా డిమాండ్ ఉంది. 

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2.57 శాతం చొప్పున ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అందుతోంది. దీనిని 3.68 రెట్లు పెంచవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాన్ని నిర్ధారించడంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకమైంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో మార్పు రావడమంటే జీతంలో మార్పు రావడమే. బేసిక్ శాలరీ కూడా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే నిర్ణయిస్తారు. 

2017లో పెరిగిన బేసిక్ శాలరీ

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 3.68 చేయడం వల్ల ఉద్యోగుల బేసిక్ శాలరీ 18 వేల నుంచి 26 వేలకు చేరుతుంది. ఇంతకుముందు అంటే 2017లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగుల బేసిక్ శాలరీ పెరిగింది. కానీ ఆ తరువాత ఇందులో ఏ విధమైన మార్పులు రాలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీ 18 వేల రూపాయలుంది. గరిష్టంగా 56,900 రూపాయలుంది.

ఒకవేళ ప్రభుత్వ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3 రెట్లు పెంచితే..డీఏ కాకుండా సిబ్బంది జీతం 18 వేల రూపాయలపై 2.57 చొప్పున 46,260 రూపాయలవుతుంది. ఒకవేళ డిమాండ్‌కు ఒప్పుకుంటే 26 వేల రూపాయలపై 3.68 చొప్పున 95,680 రూపాయలవుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3 రెట్లయితే..21 వేల రూపాయలపై 3 చొప్పున 63 వేల రూపాయలవుతుంది.

Also read: Bank Holidays November 2022: గురు నానక్ జయంతి, కార్తిక పౌర్ణమి.. ఇవాళ బ్యాంకులకు సెలవు దినమా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News