Central Govt Employees Fitment Factor: కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 52 లక్షల మందికి పైగా కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గతేడాది చివరి నాటికే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ 2023 తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఫిట్‌మెంట్‌ను సవరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు కీలకంగా మారనుంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతం ప్రకారం జీతం లభిస్తోంది. దీన్ని 3.68 శాతానికి పెంచాలని కేంద్ర ఉద్యోగుల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే.. బేసిక్ పే రూ.18 వేలు ఉండగా.. రూ.26 వేలకు పెరగనుంది. అంటే ప్రభుత్వోద్యోగుల జీతంలో 8 వేల రూపాయల పెంపు ఉండనుంది.
అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా.. బడ్జెట్ అనంతరం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతం ప్రకారం.. ఇప్పుడు రూ.18 వేల బేసిక్ శాలరీకి ఇతర అలవెన్స్‌లను జోడిస్తే.. రూ.18,000 X2.57 = రూ.46,260 వస్తుంది. అది 3.68 శాతానికి పెరిగితే.. ఉద్యోగులకు ఇతర అలవెన్సులు కలిపితే, జీతం 26,000X3.68 = రూ.95,680 అవుతుంది.
7వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెలలో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)లో పెంపుదల కూడా ఉండే అవకాశం ఉంది. నాలుగు శాతం డీఏ పెంచే అవకాశం కనిపిస్తోంది. పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)ని కూడా పెంచనుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న 18 నెలల డీఏ బకాయిలపై కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2024కి ముందే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందని.. బడ్జెట్ తర్వాత మార్చిలో అమలు చేస్తామని ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరిస్తే.. కేంద్ర ఉద్యోగుల జీతంలో భారీ పెరుగుదల ఉంటుంది. ప్రభుత్వ ప్రకటన కోసం ఉద్యోగులు వెయిట్ చేస్తున్నారు.
Also Read: Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. చంపేస్తామంటూ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త.. జీతాల పెంపు ఎప్పుడంటే..!