7th Pay Commission: ఈ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపుపై ప్రకటన

7th Pay Commission DA Hike News: బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు. డియర్‌నెస్ అలవెన్స్ 2 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రస్తుతం 41.72 శాతం డీఏ అందుతుండగా.. 44.24 శాతానికి పెరిగింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సీపీఐ సంఖ్యల ఆధారంగా డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.     

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2023, 11:51 AM IST
7th Pay Commission: ఈ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపుపై ప్రకటన

7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మొదటి 4 శాతం పెరగ్గా.. రెండో డీఏ ఎంతో పెరుగుతోందనని విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం 42 శాతం డీఏను ఉద్యోగులు పొందుతున్నారు. ఈసారి డీఏ పెంపు కూడా 3 నుంచి 4 మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించనుంది. ఇక తాజాగా బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు వచ్చింది. డియర్‌నెస్ అలవెన్స్ స్వల్పంగా పెరిగింది.

బ్యాంకు ఉద్యోగులకు బ్యాంక్ యూనియన్-ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య 11వ ద్వైపాక్షిక సెటిల్‌మెంట్ ప్రకారం డీఏ, డీఆర్ చెల్లింపు జరుగుతోంది. భారత లేబర్ బ్యూరో జారీ చేసిన వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) సంఖ్య ఆధారంగా డీఏను నిర్ణయిస్తున్నారు. తాజాగా బ్యాంకు ఉద్యోగులకు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలానికి డీఏను విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సీపీఐ (ఐడబ్ల్యూ) సంఖ్యల నిర్ణయించింది. ఏప్రిల్ నెలలో 134.20, మేలో 134.70, జూన్ నెలలో 136.40 సీపీఐ సంఖ్య నమోదైంది.

బ్యాంకు ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 596 డీఎ స్లాబ్‌కు బదులుగా 632 డీఎ స్లాబ్ అందజేస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు బ్యాంకు ఉద్యోగుల రేటు 44.24 శాతానికి పెరిగింది. 2023 మే నుంచి జూలై వరకు 41.72 శాతం డీఏ చెల్లిస్తున్నారు. మొత్తం మీద 2.52 శాతం పెరగడతో ఇక నుంచి 44.24 డీఏ అందుకోనున్నారు.

Also Read: New LTC Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. ఈ 3 రూల్స్‌లో మార్పులు  

Also Read: Bank Holidays: పెరగనున్న బ్యాంకు సెలవులు, త్వరలో వారానికి 5 రోజుల పని విధానం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News