7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కరవు భత్యం మరోసారి పెరగబోతోంది. ఆగస్టు నెలలో జరిగే కేబినెట్ భేటీలో కీలకమైన ప్రకటన రానుంది. 7వ వేతన సంఘం సిఫార్సుపై తాజా అప్‌డేట్స్..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ ఫలిస్తోంది. ఉద్యోగుల జీతం ఏకంగా 40 వేల వరకూ పెరగనుంది. ఏఐసీపీఐ గణాంకాల ప్రకారం డీఏ ఈసారి 5-6 శాతం పెరగడం ఖాయమని తెలుస్తోంది. తుది ప్రకటన మాత్రం ఆగస్టు 3వ తేదీన జరగనున్న కేబినెట్ భేటీ అనంతరం వెలువడనుంది. కేబినెట్ భేటీ తరువాత కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయనుందని సమాచారం. ఈ భేటీలో డీఏతో పాటు ఉద్యోగుల జీతం విషయంలో కూడా అప్‌డేట్ రానుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు 18 నెలల డీఏ ఎరియర్స్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.
2021 జూలై 14వ తేదీన అప్పటి కేబినెట్ భేటీలో 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా కరవు భత్యం ఒకేసారి 11 శాతం పెరిగి..జూలై 1 నుంచి అమల్లో వచ్చింది. అంతకు ముందు సంవత్సరం 2020 జనవరి , జూన్ 2020, జనవరి 2021 కరవు భత్యాన్ని కరోనా మహమ్మారి నేపధ్యంలో నిలిపివేశారు. ఆ తరువాత ఆమోదముద్ర లభించినా..ఇప్పటికీ ఆ 18 నెలల డీఏ క్లియర్ కాలేదు.
జీ బిజినెస్ అందించిన వివరాల ప్రకారం ఆగస్టు 3వ తేదీన కేంద్ర కేబినెట్ భేటీలో డీఏ పెంపుపై కీలకమైన ప్రకటన ఉంటుంది. డీఏ 6 శాతం పెంచితే..మొత్తం డీఏ 34 నుంచి 40 శాతానికి చేరుకోనుంది. ఈ లెక్కన కనీస వేతనంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో చూద్దాం. కనీస వేతనం 56, 900 అయితే..డీఏ 22, 760 రూపాయలుంటుంది. ప్రస్తుతం ఉన్న డీఏ 19, 346 రూపాయలుంది. నెలకు 3, 414 రూపాయలు డీఏ పెరగనుంది. ఏడాదికి 40 వేల 968 రూపాయలు జీతంలో పెంపు వస్తుంది.
అదే సమయంలో కనీస వేతనం 18 వేలుంటే..కొత్త డీఏ నెలకు 7,200 ఉంటుంది. ప్రస్తుతం ఉన్న డీఏ 34 శాతం ప్రకారం నెలకు 6,120 రూపాయలుంది. అంటే నెలకు 1080 రూపాయలు పెంపు కన్పిస్తుంది. ఈ లెక్కన ఏడాదికి జీతంలో 12, 960 రూపాయలు పెరుగుదల ఉంటుంది.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook