Android phones battery life: మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ టిప్స్ పాటించండి

Tips to extend the battery life of your Android phone | బ్యాటరీ వంద శాతం దాటిన తర్వాత ఛార్జింగ్ దానంతట అదే ఆగిపోతుంది. అతిగా ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. ఇది బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపిస్తుంది.

Last Updated : Nov 28, 2020, 08:03 PM IST
Android phones battery life: మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ టిప్స్ పాటించండి

అతిగా ఛార్జింగ్ చేయడం ఆపేయాలి. నిద్రపోయేటప్పుడు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టేస్తారు. ఉదయం లేచి బ్యాటరీ 100శాతం కనిపించిందని సంతోషిస్తారు. కానీ బ్యాటరీ వంద శాతం దాటిన తర్వాత ఛార్జింగ్ దానంతట అదే ఆగిపోతుంది. అతిగా ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. ఇది బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపిస్తుంది. అందుకే 90 శాతం ఛార్జింగ్ అయితే చాలు. అంతేకానీ నిద్రపోయే సమయంలో ఛార్జింగ్ పెట్టి పడుకోవడం లాంటివి మానేయడం బెటర్. 

 

కొన్నిసార్లు పొరపాటున స్మార్ట్‌ఫోన్స్‌లో వైఫై, బ్లూ టూత్ లాంటి ఆప్షన్లు ఆన్ అవుతాయి. ఇవి చాలా సమయం ఆన్‌లో ఉంటే ఈజీగా బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. అవసరం ఉన్నప్పుడు వీటిని ఆన్ చేసుకోవాలి. వైఫై అందుబాటులో ఉన్నప్పుడు మొబైల్ డేటాను ఆఫ్ చేస్తే బ్యాటరీ కాస్త అధిక సమయం వరకు వస్తుంది.

పవర్‌ సేవింగ్‌ మోడ్‌లోమై వాడకంతో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉంటుంది. ఇలా చేయడం వల్ల బ్యాటరీతో పాటు మొబైల్ మదర్ బోర్డ్‌పై ఒత్తిడి తగ్గుతుంది. మనం రెగ్యులర్‌గా వాడని యాప్స్‌ను బ్యాటరీ వినియోగించకుండా ఆపేస్తుంది.

ఈ కామర్స్ వెబ్‌సైట్స్, యాప్స్, ఫుడ్ డెలివరీ యాప్స్ కోసం అధికంగా జీపీఎస్ ఆప్షన్‌ను ఆన్ చేసి ఉంచుతాం. అయితే అవసరం లేకున్నా కొన్నిసార్లు జీపీఎస్ ఆన్‌లైన్ ఉంటుంది. దీని వల్ల బ్యాటరీ త్వరగా అయిపోయి ఛార్జింగ్ చేయవలసి వస్తుంది. కనుక జీపీఎస్‌ను సాధ్యమైనంత వరకు ఆఫ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ లైఫ్ ఎక్కువ అవుతుంది.

డార్క్ మోడ్ ఆన్ చేసుకుంటే బ్యాటరీకి హెల్ప్ అవుతుంది. తక్కువ పవర్ వినియోగం అవుతుంది. తద్వారా పలుమార్లు ఛార్జింగ్ పెట్టే అవసరం ఉండదు. బ్యాటరీ లైఫ్ కోసమే కొన్ని యాప్స్ సైతం ప్రత్యేకంగా డార్క్ మోడ్‌ను ఆండ్రాయిడ్ కస్టమర్లకు అందుబాటులోకి తెస్తుంటాయి.

Trending News