Lenovo Legion Y90 : వావ్!! ప్రపంచంలోనే మొట్టమొదటి 22GB RAM స్మార్ట్ ఫోన్

Lenovo Legion Y90, Biggest RAM storage Phone: ఫిబ్రవరిలో రిలీజ్‌ కానున్న లెనోవో లీజియన్ వై90 గేమింగ్ స్మార్ట్‌ ఫోన్ ఫీచర్స్ అదిరిపోయాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ ర్యామ్‌ స్టోరేజ్‌ ఫోన్ ఇదే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 03:00 PM IST
  • లెనోవో నుంచి త్వరలో అతి పెద్ద ర్యామ్‌ స్టోరేజ్‌తో పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ ఫోన్‌
  • ఫిబ్రవరిలో మార్కెట్లోకి రానున్న లెనోవో లీజియన్ వై90 గేమింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌
Lenovo Legion Y90 : వావ్!! ప్రపంచంలోనే మొట్టమొదటి 22GB RAM స్మార్ట్ ఫోన్

Lenovo Legion Y90: లెనోవో నుంచి త్వరలో అతి పెద్ద ర్యామ్‌ స్టోరేజ్‌తో ఒక పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ రానుంది. లెనోవో లీజియన్ వై90 గేమింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన స్మార్ట్‌ ఫోన్లతో పోల్చుకుంటే లెనోవో (Lenovo) లీజియన్ వై90 ఫోన్ ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్‌ గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా నిలవనున్నట్లు తెలుస్తుంది. 

లెనోవో లీజియన్ వై90 (Lenovo Legion Y90) స్మార్ట్‌ఫోన్‌ క్వాలకం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 చిప్‌ సెట్‌తో రానుంది. ఇక లీజియన్ వై90కు సంబంధించిన స్పెసిఫికేషన్స్‌ (Specifications‌) అన్నీ కూడా విబో షేర్‌‌ అయ్యాయి. ఫిబ్రవరిలో లెనోవో లీజియన్ వై90 లాంచ్‌ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ 22జీబీ ర్యామ్‌తో (22 GB RAM) రానుంది. అలాగే ర్యామ్ 18జీబీ ఫిజికల్ ర్యామ్‌, 4 జీబీ వర్చువల్ ర్యామ్‌తో లెనోవో లీజియన్ వై90 రానుంది.

512జీబీ + 128జీబీలతో రెండు డిఫరెంట్ ఇంటర్నల్‌ స్టోరేజ్‌లతో మొత్తం 640జీబీతో (640 GB Storage‌) లెనోవో లీజియన్ వై90 ఉంటుంది. అలాగే 6.92 ఇంచెస్ 144Hz AMOLED డిస్‌ప్లేతో ఈ మొబైల్‌ రానుంది. 64 ఎంపీ+ 16 ఎంపీ రియర్‌ కెమెరాతో 44 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఈ మొబైల్‌ రానుంది. 68వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ స్మార్ట్‌ ఫోన్‌ (Smart Phone) సపోర్ట్ చేస్తుంది. అలాగే 5,600mAh బ్యాటరీతో ఈ మొబైల్‌ (Mobile‌) వస్తుంది.

Also Read: Viral Video: హైవే రోడ్డుపై 4 కిమీ మండుతూ వెళ్లిన ట్రక్కు.. చివరకు ఏమైందంటే? (వీడియో)!!

Also Read: Rafael Nadal Prize Money: టెన్నిస్‌ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించిన నాదల్‌కు ఎంత ప్రైజ్ మనీ వచ్చిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News