Ysr Congress Party: ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజకీయంగా ఎటు వైపు ఉంటుందనేది గత కొద్దికాలంగా చర్చనీయాంశమైంది. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఆ పార్టీ ఇప్పుడు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇండీ కూటమికి చేరువౌతుందనే వాదన విన్పించింది. ఇప్పుడీ విషయంలో ఆ పార్టీ ఎంపీ స్పష్టత ఇచ్చారు.
గత ఐదేళ్ల అధికారంలో నేరుగా ఎన్డీయేలో చేరకపోయినా బీజేపీ ప్రభుత్వం తీసుకునే పలు నిర్ణయాలుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తూ వచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు బీజేపీతో కలిసి ఎన్డీయే పక్షాన చేరడంతో పరిస్థితులు మారాయి. బీజేపీ నేతల వైఖరి కూడా మారింది. అప్పట్నించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్డీయేకు దూరంగా ఉంటూ వచ్చింది. వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు ఇండీ కూటమి నేతలు మద్దతిచ్చారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ తప్ప ఇతర పార్టీలు పాల్గొన్నాయి. దాంతో వైసీపీ ఇండీ కూటమికి చేరువౌతుందనే వార్తలు విన్పించసాగాయి. ఈ క్రమంలో వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ స్టాండ్ ఏంటో చెప్పేశాయి.
కేంద్రంలోని అధికార, విపక్షాలు ఎన్డీయే, ఇండీ కూటమికి తాము దూరంగా ఉంటామని, ఏ పక్షంలో చేరమని, తమది న్యూట్రల్ స్టాండ్ అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలోని ఏ కూటమిలోనూ చేరే ఆలోచన తమకు లేదని విజయసాయి రెడ్డి తేల్చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై పార్టీ అధ్యక్షుడి అభిప్రాయమే చెబుతామన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ముందు నుంచి చెబుతున్నట్టే ఏపీ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అందుకే ఏ కూటమిలోనూ చేరేది లేదన్నారు.
Also read: Cyclone Alert: ఏపీకు తుపాను ముప్పు, ఈ జిల్లాల్లో ఇక భారీ వర్షాలు తప్పవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.