పులివెందుల: నిన్న శుక్రవారం దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి భౌతికకాయానికి ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వైఎస్ రాజారెడ్డి ఘాట్‌లో ఆయన సమాధి పక్కనే వైఎస్ వివేకా భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. అంతకన్నా ముందుగా ఇవాళ ఉదయం వైఎస్ వివేకానంద రెడ్డి పార్థివదేహం వద్ద ఆయన కుటుంబసభ్యులు ప్రార్థనలు నిర్వహించారు.
వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారనే దుర్వార్తను వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ వివేకాను కడసారి చూసుకునేందుకు ఆయన బంధువులు, మిత్రులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.