YS Sharmila: జగనన్న.. సిగ్గు సిగ్గు!! ఇంత పిరికితనమా?.. మాజీ సీఎం పై రెచ్చిపోయిన వైఎస్ షర్మిల..

Ys Sharmila on jagan: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఎక్స్ వేదికగా జగన్ పై మండిపడ్డారు. ఇంత పిరికోడివి ఆఫ్రికా అడవులకు పోతావా..?.. అంటార్కిటికాకు పోతావా అంటూ సెటైర్ లు వేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jul 28, 2024, 02:52 PM IST
  • జగన్ ను ఏకీపారేసిన షర్మిల..
  • వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్..
YS Sharmila: జగనన్న.. సిగ్గు సిగ్గు!! ఇంత పిరికితనమా?.. మాజీ సీఎం పై రెచ్చిపోయిన వైఎస్ షర్మిల..

YS Sharmila fires on AP  Ex cm ys Jagan: ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ఇటీవల  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు అసెంబ్లీలో అపోసిషన్ పార్టీ హోదా ఇవ్వాలంటూ కూడా పలుమార్లు కోర్టులలో సైతం పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా స్పీకర్ ను సైతం కొరడం జరిగింది. ఏపీలో తామే రెండో అతి పెద్ద పార్టీగా ఉన్నామని కూడా పలు మార్లు మీడియా ముందుకు వచ్చి గగ్గొలు పెడుతున్నారు. అపోసిషన్ పార్టీకి రావాల్సిన ఎమ్మెల్యేల సీట్లు రానిది.. ఏ విధంగా అపోసిషన్ హోదా ఇస్తారని కూడా  టీడీపీతో పాటు, పలువురు రాజకీయ పండితులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.

Read more: Female gym Trainer murder: ఢిల్లీ లో మహిళా జిమ్ ట్రైనర్ దారుణ హత్య.. అసలేం జరిగిందంటే..? 

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఎక్స్ వేదికగా జగన్ ను ఏకీ పారేశారు. ఇదిలా ఉండగా ఏపీలో అసెంబ్లీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ అసెంబ్లీకి ఒకసారి హజరయ్యారు.  ఆ తర్వాత మరల సభకు హజరు కాలేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా పలుమార్లు డిమాండ్ సైతం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల చేసిన ట్విట్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు!.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనమంటూ షర్మిల మండిపడ్డారు. ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవని ఎద్దేవా చేశారు. ప్రజల్ని, తన వాళ్లను మోసం చేయడం మీకు కొత్తేమీ కాదంటూ విమర్శించారు. ప్రజలు గెలిపించింది.. అసెంబ్లీకి వెళ్లి తమ గొంతుక వినిపిస్తారని షర్మిలా చెప్పుకొచ్చింది. ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందని,  అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనమంటూ షర్మిలా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

MLA = Member of Legislative Assembly, not Member of Media Assembly. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా?.. అంటే జగన్ ను ఒక రేంజ్ లో ఆటాడేసుకుంది. ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడి అని... ఏపీ రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని... నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే... తాపిగా ప్యాలస్ లో కూర్చుని మీడియా మీట్ లు పెట్లుకొంటున్నారని మండిపడ్డారు.

 గత మీ పాలనపై విమర్శలకు, అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా..? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయండంటూ కూడా వైఎస్ షర్మిలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Read more: Snake vs Mongoose: ముంగీసను పాముకాటేసిన విషం ఎక్కదు.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం తెలుసా..?

బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్కిటికా మంచులోకే పోతారో ఎవడికి కావాలంటూ షర్మిలా రెచ్చిపోయారు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని వైఎస్ షర్మిలా ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీని ఏకీపారేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News