శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటితో 317వ రోజుకు చేరుకుంది. స్థానికులు తమకు వున్న సమస్యలు విన్నవించుకుంటుండగా.. వారి విన్నపాలు వింటూ, వినతులు స్వీకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగిపోతున్నారు. నిన్న ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించి, సాయంత్రానికి శ్రీకాకుళం నియోజకవర్గంలోని 7 రోడ్స్ జంక్షన్ వద్ద ముగించిన వైఎస్ జగన్.. నేడు ఉదయం అడవిరాంపేట నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్త రోడ్ జంక్షన్ మీదుగా రాగోలు వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. రాత్రికి అక్కడే బస చేస్తారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనయలో పేర్కొన్నారు.