మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ కేసులో ప్రతిపక్షాల్నించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. అటు అవినాష్ రెడ్డి సైతం నోటీసులపై స్పందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
2019 మార్చ్ 15వ తేదీన పులివెందులలోని స్వగృహంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది. కొందరిని అరెస్టు చేసింది. ఆ తరువాత ఈ కేసు ఏపీ హైకోర్టుకు చేరి అక్కడి నుంచి సీబీఐ దర్యాప్తు సంస్థకు వెళ్లింది. ఆ తరువాత కేసు విచారణ అంత వేగవంతంగా జరగడం లేదని..వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసు తెలంగాణకు బదిలీ అయింది.
ఈ కేసులో ముందు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప అధికార పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ ఎట్టకేలకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం అంటే ఇవాళ హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపింది. అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడీ నోటీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు.
సీబీఐ దర్యాప్తుకు తాను పూర్తిగా సహకరిస్తానని ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ఇవాళ్టి విచారణకు హాజరుకాలేనని..కేవలం ఒకరోజు ముందు నోటీసు ఇవ్వడంతో సాధ్యం కాదని చెప్పారు. ముందస్తు కార్యక్రమాలు ఉండటమే దీనికి కారణమన్నారు. 5 రోజుల తరువాత ఎప్పుడు పిలిచినా హాజరౌతానన్నారు. విచారణకు మరో తేదీ ఇవ్వాలని కోరారు.
Also read: Nara Lokesh-Ramoji Rao : రామోజీరావుతో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook