Perni Nani: మాజీ మంత్రి పేర్నినాని నోట మరోసారి భరత్‌ అనే నేను సినిమా డైలాగ్..!

Perni Nani: గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పలు రాజకీయ తీర్మానాలకు ఆమోదముద్ర వేసుకున్నారు. ఈసందర్భంగా కీలక నేతలు ప్రసంగించారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 9, 2022, 03:43 PM IST
  • గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ
  • కీలక తీర్మానాలకు ఆమోదం
  • అలరించిన పేర్నినాని ప్రసంగం
Perni Nani: మాజీ మంత్రి పేర్నినాని నోట మరోసారి భరత్‌ అనే నేను సినిమా డైలాగ్..!

Perni Nani: ఏపీలో రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. వైసీపీ, టీడీపీ పోటా పోటీగా ప్రజల్లోకి వెళ్తున్నాయి.మంత్రుల బస్సు యాత్ర, ఇంటింటికి వైసీపీ, ప్లీనరీ సమావేశాలతో అధికార పార్టీ జోరు పెంచింది. మహానాడు, మిని మహానాడు, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలను టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. 

ఈసందర్భంగా మాజీ మంత్రి పేర్నినాని ప్రసంగం అలరించింది. భరత్ అనే నేను సినిమా డైలాగులతో హోరెత్తించారు. నిన్న వైసీపీకి విజయమ్మ రాజీనామా చేస్తే..పలు పత్రికలు కిరాతకంగా రాశాయని ఫైర్ అయ్యారు. సుబ్బరావు గారు ఇలాంటి తప్పుడు రాతలు రాసి..అలా వచ్చిన డబ్బుతో అన్నం ఐతే వండుకోగలరు గానీ..పెళ్లాం, పిల్లలు సంతోషంగా ఉంటారా అన్న డైలాగ్‌ను మాజీ మంత్రి పేర్నినాని చెప్పారు. 

దీంతో ఒక్కసారిగా ప్రాంగణమంతా హోరెత్తింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వినూత్న పథకాలను అమలు చేస్తోంది. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, ట్రాఫిక్ సంస్కరణాలు తీసుకొచ్చింది. భరత్‌ అనే నేను సినిమా నుంచి కాపీ కొడుతున్నారని టీడీపీ విమర్శిస్తోంది. సినిమాలో ఇలా చేస్తే ఈలలు వేస్తారు. అదే నిజ జీవితంలో చేస్తే విమర్శిస్తారు ఇద్దేం పద్దతి అని వైసీపీ మండిపడుతోంది. 

Also read:Nupur Sharma: నుపుర్ శర్మ నాలుక కోస్తే రూ.2 కోట్ల రివార్డు..వీడియో వైరల్..వ్యక్తి అరెస్ట్..!

Also read:Srilanka Crisis:శ్రీలంక మళ్లీ రణరంగం.. అధ్యక్షుడు  గొటబయ రాజపక్స పరార్..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News