'కరోనా వైరస్'.. కాటేస్తే .. కాటికే..!! అందుకే జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం చెప్పినట్టు.. పోలీసులు చెప్పినట్టు వినండి. లేదని ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చారో.. యమధర్మరాజు పాశం విసురుతాడు జాగ్రత్త..! బుద్ధిగా ఇంట్లో ఉండండి.. మాస్కులు ధరించండి...!! సరిగ్గాఇలాగే ప్రచారం చేస్తున్నాడు యమధర్మరాజు.
'కరోనా వైరస్' గురించి అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణ యంత్రాంగం కొత్తగా ఆలోచించింది. నేరుగా యమధర్మరాజును రంగంలోకి దింపింది. ఆయనతోపాటు చిత్రగుప్తుడు, ఓ రాక్షసుడు కూడా ఉన్నారు. రాజాం పట్టణంలో వీధివీధి తిరుగుతూ కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని చెబుతున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. అంతే కాదు ముఖానికి మాస్క్ ధరంచాలని కోరుతున్నారు. మాస్కులు లేని వారికి మాస్కులు అందిస్తున్నారు.
రెండు రోజుల క్రితం నలుగురు వ్యక్తులకు రాజాం పట్టణంలో కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాజాం పట్టణ యంత్రాంగం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరోవైపు రాజాంలో నాలుగు కేసులు పాజిటివ్ గా నిర్థారణ కాకముందు శ్రీకాకుళం జిల్లా గ్రీన్ జోన్ గా ఉండడం విశేషం.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..