Yaas Cyclone live updates: యాస్ తుపాను తూర్పు-మధ్య బంగాళాఖాతం నుంచి వాయువ్య దిశలో కదులుతున్నట్టు భారత వాతావరణ శాఖ మంగళవారం మధ్యాహ్నం వెల్లడించింది. యాస్ తుపాను రానున్న 12 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశలో కదిలి పెను తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. మధ్యాహ్నం సమయానికి ఒడిషాలోని పారాదీప్‌కి దక్షిణ-ఆగ్నేయ దిశగా 220 కిమీ దూరంలో, ఒడిషాలోని బాలాసోర్‌కి దక్షిణ-ఆగ్నేయం దిశగా 330 కిమీ దూరంలో అలాగే పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణ-ఆగ్నేయంలో 320 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావారణ శాఖ తమ తాజా వెదర్ బులెటిన్‌లో పేర్కొంది.
ఒడిషాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్స్‌కి మధ్య ధమ్రా పోర్టుకు సమీపంలో ఉత్తరాన బుధవారం తెల్లవారిజామున తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. యాస్ తుపాను తీరం దాటే సమయంలో పెను తుపానుగా మారి అతివేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయని, తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also read : Yaas Cyclone Update: యాస్ తుపాను ప్రభావంతో..మరో మూడ్రోజులపాటు వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా.. వెంటనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యాస్ తుపాన్ ప్రభావిత రాష్ట్రాలైన ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో యాస్ తుపానును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తీరప్రాంతాల వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు తరలించడంతో పాటు మత్య్సకారులు ఎవ్వరు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని అన్నారు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఆక్సీజన్ సరఫరా కీలకం అయినందున మూడు రాష్ట్రాల్లోని ఆక్సీజన్ ప్లాంట్స్‌లో (Oxygen plants) ఆక్సీజన్ ఉత్పత్తికి తుఫాన్ కారణంగా ఎలాంటి అవాంతరాలు, నష్టం కలగకుండా జాగ్రత్తలు వహించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.
Also read: Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు శుభవార్త, DA రెట్టింపు చేసిన సర్కార్
ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan), ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సమీక్షా సమావేశంలో పాల్గొని యాస్ తుపానును (Cyclone Yaas) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తీసుకుంటున్న చర్యలు గురించి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు (Amit Shah) వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook