Winter Effect: చలి పంజా విసురుతోంది. డిసెంబర్ చివరి రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. మరో మూడ్రోజులు చలిగాలులు పెరుగుతాయని వాతావరణ శాఖ సూచిస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గత 4-5 రోజుల్నించి ఉష్ణోగ్రత రోజురోజుకీ పడిపోతోంది. రాత్రి వేళల్లో, తెల్లవారుజామున చలిగాలులు వీస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా జిల్లాల్లో చలి తీవ్రత(Winter Cold Waves)మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రత పడిపోతూ..చలి తీవ్రత పెరుగుతోంది. చలిగాలులు పెరుగుతుండటంతో చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రెండు రాష్ట్రాల్లో మరో మూడు నాలుగు రోజులు చలిగాలులు వీస్తాయని ఐఎండీ(IMD)తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలోని అదిలాబాద్ జిల్లా, ఏపీలోని ఏజెన్సీ, విశాఖ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత కనిష్టస్థాయిలో ఉంటుందని పేర్కొంది. సాయంత్రం 5 గంటల నుంచే చలి తీవ్రత ప్రారంభమై...రాత్రికి చలిగాలులు అధికమౌతున్నాయి. తెల్లవారుజామున పొగమంచు చాలా దట్టంగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఇప్పటి విశాఖలోని లంబసింగిలో ఉష్ణోగ్రత దారుణంగా పడిపోయింది.
Also read: Snake hulchul: ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంట్లో రక్తపింజర కలకలం-భయంకరంగా బుసలు కొట్టిన పాము
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook