జగన్ పెట్టిన శీలపరీక్ష నెగ్గిన పవన్ !

జనసేన ఆవిర్భావ సభలో టీడీపీనే ప్రధాన టార్గెట్ గా పవన్ చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది.

Last Updated : Mar 15, 2018, 12:39 PM IST
జగన్ పెట్టిన శీలపరీక్ష నెగ్గిన పవన్ !

జనసేన ఆవిర్భావ సభలో టీడీపీనే ప్రధాన టార్గెట్ గా పవన్ కల్యాణ్  చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది..అసలు పవన్  టీడీపీనే ప్రధానంగా టార్గెట్ చేసుకొని ఎందుకు ప్రసంగించినట్లు అని ప్రతి ఒక్కరి మైండ్ లో మెదలుతున్న ప్రశ్న. పవన్ ఇలా ప్రసంగించనికి ఓ లోతైన కారణముందని..  జగన్ పెట్టిన శీలపరీక్ష స్పందించే ఇలా మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇంతకీ ఏంటా శీల పరీక్ష.. పవన్ ఆ పరీక్షకు ఎందుకు స్పందించారనే విషయాన్ని తెలుసుకుందామా ..

 పవన్ ఉనికి కోసమేనా ?

జనసేన 'శీలపరీక్ష' .. దీన్ని వినడానికి కాస్తా ఇబ్బందికరంగా ఉన్నా.. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ మాట్లడిన తీరు కూడా అలాగే ఉందట. పవన్ కల్యాణ్ టీడీపీకి ఎజెంట్ లా వ్యవహరిస్తున్నారని చాలా కాలం నుంచి వైసీపీ ఆయనపై విమర్శలు చేస్తూవస్తున్న విషయం తెలిసిందే. టీడీపీకి పవన్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని....చంద్రబాబుకు ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా ఆయన్ను రక్షించేందుకు వస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి.  ఈ ఆరోపణలు అసత్యమని చెప్పుకునేందుకు ఆవిర్భాభ సభను వేదికగా ఎంచుకున్నారట పవన్.

పవన్ విమర్శలు వైసీపీకి ప్లస్ పాయింట్

పవన్ ప్రసంగాన్ని పూర్తిగా వింటే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చుని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. పవన్ తన ప్రసంగంలో ప్రధానంగా టీడీపీని టార్గెట్ చేస్తూ నడిచిందనేది జగమెరిగిన సత్యమంటున్నారు. వైసీపీ విమర్శలకు చెక్ పెట్టేందుకే పవన్ ఇలా మాట్లాడరని.. జగన్ పెట్టిన శీలపరీక్షకు స్పందించిన పవన్ ఇలా నిరూపించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రాజకీయంగా చూస్తే ఇది పవన్ కు ఏ మేరకు గ్రాఫ్ ఉంటుందనే విషయం పక్కన పెడితే.. నిరంతరం టీడీపీ, చంద్రబాబును విమర్శించే ప్రతిపక్ష పార్టీకి, జగన్ కు మాత్రం ఇది కలిసొచ్చే అంశంగా పరిగణిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైసీపీ ఉచ్చులో పడ్డ పవన్

పవన్ కల్యాప్ ప్రతిపక్ష పార్టీ ఉచ్చులో పడ్డారని అధికార టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ ఎజెంట్ అనే విమర్శలను నుంచి బయటపడేందుకే పవన్ ఇలా మట్లాడారు. టీడీపీతో కలిసి ఉంటే తన ఉనికి ఉండదనే ఆత్మరక్షణలో మాట్లాడారు తప్పితే..వాస్తవానికి  టీడీపీపై ఆయన చేసిన ఆరోపణల్లో సత్యదూరమని టీడీపీ నేతలు చెబుతున్నారు. పవన్ కు దమ్ముంటే చంద్రబాబు, ఆయన తనయుడిపై చేసిన ఆరోపణలు నిరూపించాలని కోరుతున్నారు తెలుగు తమ్ముళ్లు.

Trending News