చిరంజీవి దారెటు ? ఒక వైపు కాంగ్రెస్.. మరోవైపు జనసేన 

                                 

Last Updated : Oct 16, 2018, 12:07 PM IST
చిరంజీవి దారెటు ? ఒక వైపు కాంగ్రెస్.. మరోవైపు జనసేన 

కాంగ్రెస్ కు చిరంజీవి గుడ్ బై చెబుతున్నారా ..వచ్చే ఎన్నికల్లో తమ్ముడికి సపోర్టు చేయాలని డిసైడ్ అయ్యారా అంటే.. తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. 

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ కనీసం కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన స్టేట్ మెంట్లు ఇవ్వడం లేదు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా కోరినా చిరంజీవి స్పందించలేదని సమాచారం. పైగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగిసినా చిరంజీవి ఇంకా దాన్ని పునరుద్ధరించుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలను చూస్తుంటే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇదే సందర్భంలో చిరంజీవి ఆయన తమ్ముడు పవన్ పార్టీ జనసేనకు దగ్గరౌతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరిన సందర్భంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ కు అన్న చిరంజీవి ఆశీస్సులు ఉంటాయని చెప్పడం గమనార్హం. ఈ వ్యాఖ్యలతో చిరంజీవి వచ్చే ఎన్నికల్లో తమ్ముడికే సపోర్ట్ చేస్తారనే టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. 

చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా..? పార్టీకి గుడ్ బై  చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటారా..?  కాంగ్రెస్ ను వీడి జనసేనలో చేరి తమ్ముడికి అండగా నిలుస్తారా ? అనేది దానిపై ఉత్కంఠత నెలకొంది. ఈ విషయంలో  మెగాస్టార్ చిరంజీవి స్పందనపై జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

Trending News