/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఓడించాలని చంద్రాబాబు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు..ఈ విషయంలో ఆయన కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. సీట్ల విషయంలో ఎక్కడా పేచిపెట్టలేదు..ఎన్నికల్లో తన పార్టీ గెలుపుకంటే కేసీఆర్ ఓటమే ప్రధాన లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు తన ప్రయత్నాలు చేశారు..అదే స్థాయిలో ప్రచారం కూడా నిర్వహించారు. ఇటు కేసీఆర్ సైతం కాంగ్రెస్ కంటే చంద్రబాబునే ఎక్కవగా టార్గెట్ చేసుకొని విమర్శలు సంధించారు. చంద్రబాబును బూచీగా చూపించి తెలంగాణ ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో ఆయన సఫలీకృతమైనట్లు ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఫలితం వచ్చినా చంద్రబాబుపై కేసీఆర్ పగ మాత్రం చల్లారలేదనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబుపై ప్రతీకారాన్ని తీర్చకుంటానని కేసీఆర్ విషయాన్ని బహిరంగానే ప్రకటించారు.. ఈ నేపథ్యంలో చంద్రబాబును దెబ్బకొట్టేందుకు కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు..అందుకు ఎలాంటి ఆప్షన్స్ ను ఎంచుకుంటారనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. 

దెబ్బతీస్తానని కేసీఆర్ ఛాలెంజ్..

తెలంగాణలో చంద్రబాబు ఎంత ప్రచారం చేసినా ఆయనకు దక్కింది రేండే రెండు సీట్లు..ఇక్కడ మహాకూటమికి వచ్చింది కేవలం 22 సీట్లు మాత్రమే.. ఇక్కడ చంద్రబాబు ప్రచారం ఎంత వరకు సక్సెస్ అయింది అనే దానికంటే కేసీఆర్ ను ఓడించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలే ఇక్కడ హాట్ టాపిక్ గా నిలిచాయి.. ఎన్నికల ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పై అడపాదడపా విమర్శలు చేసి చంద్రబాబునే ఎక్కువగా టార్గెట్ చేస్తూ మాట్లాడారు.. రానున్న రోజుల్లో చంద్రబాబుకు తన తడాఖా చూపిస్తానంటూ కేసీఆర్ ఛాలెంట్ చేశారు.. ఈ సారి జరిగే ఏపీలో ఎన్నికల్లో చంద్రబాబు దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తానని కేసీఆర్ పరోక్షంగా చెప్పకనే చెప్పారు

రెండే రెండు ఆప్షన్స్ ...ఇందులో ఏది బెటర్

ఇలాంటి తరుణంలో కేసీఆర్ ముందు ఎలాంటి ఆప్షన్ ఉన్నాయనే దానిపై చర్చ జరుగుతుంది. టీడీపీలా  కేసీఆర్ కు ఏపీలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం లేదు..అయితే బాబును దెబ్బకొట్టాలంటే ఆయన శత్రవులను గుర్తించి వాళ్ల మద్దతు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ ఎలాంటి పంథా అనుసరిస్తారు.. ఆయన ముందున్న ఆప్షన్ ఏంటని పరిశీలిస్తే తొలి ఆప్షన్  ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఉంటే ..రెండో ఆప్షన్ జనసేన ఉంది.. ఈ ఇద్దరిలో కేసీఆర్ ఎవరితో దోస్తీ చేస్తారు..దోస్తీ చేసినా ఏ రూపంలో చంద్రబాబును దెబ్బకొడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది

కేసీఆర్ ముందు తొలి ఆప్షన్ వైసీపీ
చంద్రబాబును దెబ్బకొట్టాలంటే కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ లో మొదటిది వైసీపీ ఉంది. తెలంగాణలో చంద్రబాబు ప్రచారం తరహా ఏపీలో కేసీఆర్.. వైసీపీ తరఫున ప్రచారం చేస్తారని ఊహాగానాలు వెలువడున్నాయి. అయితే ఆయన ఏపీ రాజకీయాల్లో చొరవ చూపటానికి ఏదైనా బలమైన కారణం ఉండాలి.. ఈ ప్రశ్నే ఇక్కడ ఉత్పన్నమౌతుంది..అందుకే కేసీఆర్ ఫెడలర్ ఫ్రంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీల అధినేతలతో కలిసే ఉద్దేశముందని చెప్పిన కేసీఆర్... జాతీయ స్థాయిలో ఎలాంటి స్థాండ్ తీసుకోని వైసీపీని ఎరవేయాసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. అయితే దీనికి  జగన్  అంత ఈజీగా ఒప్పుకుంటారా అనేదే ఇక్కడ ప్రశ్న. ఒకవైపు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూ మరోవైపు దాన్ని వ్యతిరేకించే కేసీఆర్ తో దోస్తీ చేస్తే ఎన్నికల్లో దుష్పపరిణామాలు వచ్చే అవకాశముందనే వాదన ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ తో దోస్తీ చేసేందుకు జగన్ ముందుకు రాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ ఏదైనా ఉంటే ఎన్నికల తర్వాత ఉండవచ్చనే వాదన కూడా ఉంది...

కేసీఆర్ ముందు రెండో ఆప్షన్ జనసేన

తన మిత్రత్వాన్ని జగన్ తిరస్కరిస్తే కేసీఆర్ ముందున్నరెండో ఆప్షన్ జనసేన పార్టీ. పైగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ టీఆర్ఎస్ కు అనుకూల దోణితో ఉన్నారని చెప్పవచ్చు. గతంలో తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. కేసీఆర్ కు అనుకూల ప్రకటన చేసి ఉన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు విమర్శలకు దారి తీయడంతో తెలంగాణ ఎన్నికల సమయంలో ఎటూ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోయారు. అయితే అప్పటి నుంచి పవన్ కల్యాణ్.. టీఆర్ఎస్ ను కానీ.. కేసీఆర్ కానీ విమర్శిచే దాఖలాలు లేవు. మద్దతు విషయంలో కేసీఆర్ నుంచి ప్రతిపాదన ఒస్తే అంగీకరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేసీఆర్ ఈ ప్రదిపాదన పెట్టే సాహసం చేయబోరనే వాదన వినిపిస్తుంది..ఎందుకంటే జనసేన బలపడితే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలి అది కాస్తా టీడీపీకి లబ్ది చేకూరే ప్రమాదముంది.

ఇందులో ఏది బెటర్ ?

కేసీఆర్ ముందు ఉన్న ఆప్షన్స్ లో అనుకూల.. ప్రతికూల అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ నిశితంగా పరిశీలించి ..వాటిని బేరీజు వేసుకున్న తర్వాతే కేసీఆర్ తన వ్యహాన్ని అమలు చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబును దెబ్బకొట్టేందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు..ఎలాంటి ఆప్షన్స్ ఎంచుకుంటారనే అంశంపై ఉత్కంఠత నెలకొంది. ఇది తేలాలంటే సార్వత్రిక ఎన్నికల వచ్చే వరకు వేచిచడాల్సిందే మరి... 

Section: 
English Title: 
What is the KCR strategy of shattering Chandrababu ?
News Source: 
Home Title: 

చంద్రబాబును దెబ్బకొట్టే కేసీఆర్ వ్యూహం ఏంటి ?

చంద్రబాబును దెబ్బకొట్టే కేసీఆర్ వ్యూహం ఏంటి ?..ముందున్న ఆప్షన్స్ ఇవే
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
చంద్రబాబును దెబ్బకొట్టే కేసీఆర్ వ్యూహం ఏంటి ?
Publish Later: 
No
Publish At: 
Wednesday, December 12, 2018 - 14:48