తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి పంచాయితీ..!!

నిన్న, మొన్నటి వరకు స్నేహం గుభాళించిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ పంచాయితీ మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల మధ్య నీటి పంచాయితీ రాజుకుంది. ఈసారి శ్రీశైలం ప్రాజెక్టులోని జలాల వాడకంపై గొడవ ప్రారంభమైంది.

Last Updated : May 12, 2020, 10:38 AM IST
తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి పంచాయితీ..!!

నిన్న, మొన్నటి వరకు స్నేహం గుభాళించిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ పంచాయితీ మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల మధ్య నీటి పంచాయితీ రాజుకుంది. ఈసారి శ్రీశైలం ప్రాజెక్టులోని జలాల వాడకంపై గొడవ ప్రారంభమైంది.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ  ఎత్తిపోతల పథకాన్నిప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐతే దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి తరలింపు విషయంపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి.. కచ్చితంగా ఏపీ తీరును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఏపీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తామని.. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. 

అపెక్స్ కమిటీకి చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు ఎలా రూపకల్పన చేస్తుందని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. గతంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టులకు స్నేహహస్తం అందించామని చెప్పుకొొచ్చారు. సహకార స్ఫూర్తిగా భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని ఘాటుగానే హెచ్చరించారు. కృష్ణా జలాల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకునిపోతే రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు తాగునీటి సమస్య తలెత్తుతుందని తెలిపారు. 

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభిప్రాయంపై ఆంధ్రప్రదేశ్ సర్కారు స్పందించింది. రాయలసీమ కరువును నివారించేందుకే విభజన చట్టానికి లోబడే ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పుకొచ్చింది. గోదావరి జలాలను బాణకచర్లకు పథకం ప్రతిపాదన అని తెలిపింది. ఇందుకోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి ప్రవాహం పెరిగేలా రాయలసీమ పంపింగ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తామని వివరించింది. రోజుకు 6 నుంచి 8 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపింది. 

మరోవైపు ఇవాళ( మంగళవారం) కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల ఇంజినీర్లు తమ వాదనలను బోర్డు ముందు వినిపించే అవకాశం ఉంది. ఈ క్రమంలో బోర్డు నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News