Vizag Steel Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైజాగ్ స్టీల్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

Vizag Steel Recruitment 2022: వైజాగ్‌ స్టీల్‌ ఫ్లాంట్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పూర్తి వివరాలు మీ కోసం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 11:39 AM IST
  • నిరుద్యోగులకు శుభవార్త
  • వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
  • ద‌ర‌ఖాస్తుల చివరి తేదీ: 09-02-2022
Vizag Steel Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైజాగ్ స్టీల్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

Vizag Steel Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త. విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (వైజాగ్‌ స్టీల్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి (Vizag Steel Recruitment 2022) నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ‌లో కాంట్రాక్ట్ విధానంలో పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. దరఖాస్తుల స్వీకరణ నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్  (online)లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

నోటిఫికేషన్ వివరాలు: 
* భర్తీ చేయనున్న ఖాళీలు- 5
>> మైన్ ఫోర్‌మెన్ పోస్టులు -1
>> మైనింగ్ మేట్ పోస్టులు -4

అర్హతలు: 
>> మైన్ ఫోర్‌మెన్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు మైనింగ్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టులో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా మైన్‌ ఫోర్‌మెన్‌ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత పనిలో అనుభవం త‌ప్ప‌నిస‌రి.
>> మైనింగ్ మేట్ పోస్టుల‌కు అప్లై చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణత. మైనింగ్‌ మేట్‌ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్య‌ర్థుల వ‌య‌సు 01-01-2022 నాటికి 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

Also Read: IOCL Recruitment 2022: ఐఓసీఎల్‌లో 137 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు..

ముఖ్య‌మైన సమాచారం
* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్య‌ర్థుల‌ను ఆన్‌లైన్‌ టెస్ట్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ద‌ర‌ఖాస్తుల ప్రారంభం తేదీ: 26-01-2022
* ద‌ర‌ఖాస్తుల చివరి తేదీ: 09-02-2022

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News