Vizag Serial Killer: వరుస హత్యలతో విశాఖ వాసులను బెంబేలెత్తించిన సీరియల్ కిల్లర్ అరెస్ట్...

వరుస హత్యలతో విశాఖ వాసులను బెంబేలెత్తించిన సీరియల్ కిల్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హంతకుడిని చందక రాంబాబు‌గా గుర్తించారు. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 17, 2022, 12:07 PM IST
  • వైజాగ్ సీరియల్ కిల్లర్ అరెస్ట్
  • నిందితుడిని రాంబాబుగా గుర్తించిన పోలీసులు
  • మహిళలపై ద్వేషంతో వరుస హత్యలు
Vizag Serial Killer: వరుస హత్యలతో విశాఖ వాసులను బెంబేలెత్తించిన సీరియల్ కిల్లర్ అరెస్ట్...

Vizag Serial Killer: వరుస హత్యలతో విశాఖ వాసులను బెంబేలెత్తించిన సీరియల్ కిల్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హంతకుడిని చందక రాంబాబు‌గా గుర్తించారు. తన భార్య అక్రమ సంబంధం బయటపడ్డప్పటి నుంచి మహిళలంటేనే రాంబాబు ద్వేషం పెంచుకున్నాడు. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్స్, నిర్మాణంలో ఉన్న భవనాలకు వాచ్‌మెన్లుగా ఉండే దంపతులను లక్ష్యంగా చేసుకుని పలు హత్యలకు పాల్పడ్డాడు. వరుస హత్యలతో అప్రమత్తమైన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... అనకాపల్లి జిల్లాకు చెందిన చందక రాంబాబు (49)  తాపీ మేస్త్రీగా, ఆటో డ్రైవర్‌గా కూడా పనిచేశాడు. 18 ఏళ్ల వయసులో అతనికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అక్కడొక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో రాంబాబు భార్య ఇంటి యజమానితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఆ విషయం రాంబాబుకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారు. అప్పటినుంచి పిల్లలు కూడా రాంబాబుకి దూరంగా ఉంటున్నారు. కుటుంబ జీవితం కకావికలం కావడంతో రాంబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అదే సమయంలో తాను పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థ చేతిలోనూ మోసపోయాడు. దీంతో మరింత కుమిలిపోయాడు. దీనంతటికీ కారణం తన భార్యేనని భావించాడు. మహిళల పట్ల ద్వేషం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖకు మకాం మార్చిన రాంబాబు అక్కడి ఫంక్షన్ హాల్స్‌లో పనిచేస్తూ, అందులోనే తింటూ జీవితం గడుపుతున్నాడు. కొన్నాళ్లు పెందుర్తిలో ఓ అద్దె ఇంట్లో ఉండగా క్షుద్ర పూజలు చేస్తున్నాడనే కారణంతో గెంటేశారు. అప్పటినుంచి ఫంక్షన్ హాల్స్‌లోనే ఉంటున్న రాంబాబు ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మొదలుపెట్టాడు. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్లు, నిర్మాణంలో ఉన్న భవనాలకు వాచ్‌మెన్లుగా ఉండే దంపతులపై సులువుగా దాడి చేయొచ్చునని భావించాడు. అలా సుజాతనగర్ నాగమల్లి లే ఔట్‌లో లక్ష్మీ అనే మహిళను, ముషివాడలో వృద్ద దంపతులను హత్య చేశాడు. పెందుర్తిలో నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్‌మెన్‌గా ఉన్న మహిళ, ఆమె కుమారుడిపై దాడి చేశాడు. ఈ హత్యలన్నీ ఒక్కడే చేసి ఉంటాడని అనుమానించిన పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు జరిపి రాంబాబును అరెస్ట్ చేశారు. విచారణలో రాంబాబు చేసిన నేరాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.

Also Read:  Munugode ByPoll Live Updates: జగదీశ్ రెడ్డికి బిగ్ షాక్.. 10 మంది టీఆర్ఎస్ సర్పంచ్ లు బీజేపీకి జంప్

Also Read: కార్తికేయ 2 సినిమా విజయానందం కంటే.. బాధే ఎక్కువగా ఉంది: అనుపమ పరమేశ్వరన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News