Visakhapatnam steel plant: విశాఖ ఉక్కుకోసం రాజీనామాలు..గంటా శ్రీనివాసరావు తొలి రాజీనామా

Visakhapatnam steel plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి హోరెత్తనుంది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తొలి రాజీనామాను ఓ ఎమ్మెల్యే సమర్పించారు.

Last Updated : Feb 6, 2021, 06:03 PM IST
Visakhapatnam steel plant: విశాఖ ఉక్కుకోసం రాజీనామాలు..గంటా శ్రీనివాసరావు తొలి రాజీనామా

Visakhapatnam steel plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి హోరెత్తనుంది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తొలి రాజీనామాను ఓ ఎమ్మెల్యే సమర్పించారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ( Visakhapatnam steel plant ) ప్రైవేట్ పరం ( Privatisation ) చేస్తూ కేంద్ర ప్రభుత్వం ( Central Government ) నిర్ణయం తీసుకోగానే పెద్దఎత్తున నిరసన ప్రారంభమైంది. కేంద్ర  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. విశాఖలో భారీ ర్యాలీ ద్వారా ఆందోళనను వ్యక్త పరిచారు. ఉద్యమకారుల త్యాగాల్ని వృధా కానివ్వమని..ప్రైవేటీకరణ జరగనివ్వమని ప్రతిజ్ఞ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళన ( Protest on Visakha steel plant privatisation ) కు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మద్దతుగా నిలిచారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని మరోసారి చాటిచెప్పారు. 

ఇప్పుడిదే అంశంపై రాజీనామాల పర్వం ( Resignations ) ప్రారంభమైన సూచనలు కన్పిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా ( Mla Ganta Srinivasa rao resignation ) లేఖ సమర్పించారు.  స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వచ్చిన తరువాతనే రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు ఓ లేఖ రాశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రారంభమైన నిరసనకు మద్దతుగా ఇదే తొలి రాజీనామా.

Also read: Ap Panchayat Elections 2021: మరోసారి వివాదాస్పద ఉత్తర్వులిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News