New Year 2022: విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు- సెక్షన్ 144 అమలు

New Year 2022: విజయవాడలో న్యూ ఇయర్​ వేడుకలపై కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు. అర్ధ రాత్రి వరకు బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరపడంపై నిషేధం విధించారు. మరిన్ని ఆంక్షల వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 04:13 PM IST
  • కొత్త సంవత్సర వేడుకలపై విజయవాడ పోలీసులు ఆంక్షలు
  • ఐదుగురికి మించి గుమి గూడొద్దని హెచ్చరిక
  • వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచన
  • నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం
New Year 2022: విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు- సెక్షన్ 144 అమలు

New Year 2022: కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్​ వేరియంట్ భయాలు కొనసాగుతున్న వేళ.. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సమయంలో ప్రజలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం (New Year Celebrations) చెప్పేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడలో తాజాగా కఠిన ఆంక్షలు విధించారు (Restrictions on new Year Celebrations in Vijayawada) నగర పోలీసులు. ఈ మేరకు విజయవాడ పోలీస్​ కమిషనర్​ కాంతి రాణా టాటా పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.

విజయవాడలో కఠిన ఆంక్షలు ఇలా..

  • బహిరంగ ప్రదేశాల్లో ఆర్ధ రాత్రి వరకు న్యూ ఇయర్​ వేడుకలకు అనుమతి లేదు. ఐదుగురికన్నా ఎక్కువ మంది గుమి గూడటం నిషేధం
  • క్లబ్​లు, రెస్టారెంట్లలో 60 శాతం ఆక్యుపెన్సీతోనే వేడుకలు జరగాలి. న్యూ ఇయర్​ వేడుకలు నిర్వహించే రెస్టారెట్లు, క్లబ్​లు ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
  • డీజేలు, భారీ స్పీకర్లకు అనుమతి లేదు. రోడ్లపై కేకులు కట్ చేయడం వంటి పనులు చేయొద్దు. సెక్షన్ 144 అమలులో ఉంటుంది.
  • టపాసులు పెల్చడం వంటి చర్యల వల్ల పిల్లలకు, వృద్ధులకు ఇబ్బంది కలగొచ్చు. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
  • మద్యం తాగి డ్రైవింగ్ చేసేందుకు అనుమతి లేదు. అర్ధ రాత్రి వరకు కేకలు వేస్తూ రోడ్లపై తిరగటంపై కూడా నిషేధం, నగర వ్యాప్తంగా 15 చోట్ల డ్రంక్​ అండ్ డ్రైవ్​ టెస్టులు నిర్వహించనున్నారు పోలీసులు.
  • ప్రధాన రహదారులైన బందర్​ రోడ్, ఏలూరు రోడ్​, బీఆర్​టీఎస్​ రోడ్లలో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయి. బెంజ్ సర్కిల్​ ఫ్లై ఓవర్, కనకదుర్ఘ ఫ్లై ఓవర్​, పీసీఆర్​ ఫ్లై ఓవర్​లపై ట్రాఫిక్​కు అనుమతి లేదు

ఈ నిబంధనలు అతిక్రమించిన ఎవరైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వెల్లడించారు విజయవాడ పోలీసులు. తాగి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, రోడ్లపై అల్లర్లు సృష్టించడం వంటి వాటికి పాల్పడితే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరారు.

కొత్త సంవత్సర వేడుకలకోసం పిల్లలు ఎక్కడకి వెళ్తున్నారు? అనే విషయంపై తల్లిదండ్రులకు నియంత్రణ ఉండాలని పోలీసులు సూచించారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని తెలిపారు. ఇంట్లోనే అందరు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని కోరారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రజలంతా సహకరించాలని తెలిపారు.

Also read: Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

Alsos read: Jahnavi Dangeti: ఆంధ్ర అమ్మాయి జాహ్నవి రికార్డ్.. నాసా ట్రైనింగ్‌లో పాల్గొన్న మొదటి భారతీయురాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News