కృష్ణానదిలో బోటు బోల్తా, 16 మంది జలసమాధి

కృష్ణానది‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పవిత్ర సంఘమం వద్ద  బోటు బోల్తా పడి..16 మంది మృత్యువాతపడ్డారు. మరో ఏడుగురు అచూకీ గల్లంతైంది.

Last Updated : Nov 13, 2017, 04:07 PM IST
కృష్ణానదిలో బోటు బోల్తా, 16 మంది జలసమాధి

విజయవాడ: కృష్ణానది‌లో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంఘమం వద్ద  బోటు బోల్తా పడి..16 మంది మృత్యువాతపడ్డారు. మరో ఏడుగురు అచూకీ గల్లంతైంది. ప్రమాదం జరిగిన సమాచారాన్ని అందుకున్న సహాయక బృందం 15 మంది ప్రయాణికులకు రక్షించింది. వీరిలో 9 మందికి ప్రాధిమిక చికిత్స చేసి డిశ్చార్ట్ చేయగా..మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.కాగా మృతుల్లో ఎక్కువ మంది ప్రకాశం జిల్లా ఒంగోలు  వాసులుగా గుర్తించారు. పవిత్ర సంఘమం వద్ద కృష్ణమ్మ హారతులను చూసేందుకు వెళ్తుండగా పడవ బోల్తా పడింది.

ఘటనపై అధికారుల స్పందిస్తూ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బోటు మితిమీరిన సంఖ్యలో పర్యాటకులను ఎక్కించుకోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ప్రమాదానికి గల కారణాలను వివరిస్తూ ...బోటు సిబ్బందికి తగిన నైపుణ్యం లేకపోవడం...నది మార్గంపై డ్రైవర్ కు అవగాహన లేకపోవడం...భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాధమికంగా తేల్చారు. ఈ దుర్ఘటనకు సంబంధించి సంబంధించిన లోతైన దర్యాప్తు జరుగుతోంది

Trending News