/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Aadhaar Card Update: భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు.. చాలా అవసరం. ప్రైవేట్ కలాపాల నుంచి బ్యాంకింగ్ దాకా.. ఆధార్ కార్డు ప్రతి చోట అవసరం. అయితే ఆధార్ కార్డులో మన వివరాలు అన్నీ సరిగ్గా ఉండాలి. కానీ ఫోన్ నెంబర్, అడ్రస్ ఇలాంటివి మారినప్పుడు వెంటనే ఆధారం కార్డ్ లో కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన పేరు, పుట్టినరోజు వంటి వివరాలు కూడా కరెక్ట్ గా ఉండాలి. 

5 నుండి 15 సంవత్సరాల కంటే.. తక్కువ వయసు ఉన్న చిన్నారులకి కూడా ఆధార్ కార్డ్ తీసుకోవాలి. వారి ఫోటోలు, బయోమెట్రిక్ వివరాలు కూడా అప్‌డేట్ చేయడం ముఖ్యం. ఒకవేళ అందులో ఏమైనా మార్పులు చేయాలి అంటే.. ఆధార్ అధికారులు జూన్ 14 దాకా గడువు విధించారు. తాజాగా ఇప్పుడు ఆ గడువుని.. మరికొద్ది రోజులపాటు పొడిగించారు. అంతేకాకుండా ఆధార్ లో అప్డేట్ చేయడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ఏం చెప్పారు. జూన్ 14 నుండి సెప్టెంబర్ 14 దాకా ఉచితంగా మన ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 14 దాకా మాత్రమే ఫ్రీ:

ఒకవేళ సెప్టెంబర్ 14 తర్వాత ఆధార్ కార్డు లో ఏమైనా మార్పులు చేయాలి అంటే.. అప్పుడు దానికి తగ్గట్టుగా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అప్పటిదాకా ఎదురు చూడకుండా, ఈ గడువు ముగిసేలోపు ఆధార్ కార్డు పోర్టల్‌లో ఫ్రీగా అప్‌డేట్ చేసుకుంటే మంచిది.

ఆధార్ కార్డు అప్‌డేట్ చేయడం ఎలా:

ఆధార్ కార్డు లో మార్పుల కోసం UIDAI వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో మనకి కావాల్సిన భాషను సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఇచ్చి దానికి వచ్చే ఓటిపి ని కూడా అందులో ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. అక్కడ ఎన్‌రోల్‌మెంట్/కరెక్షన్/అప్‌డేట్ ఫారమ్స్‌లో మీకు కావాల్సిన ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా నింపాలి. ఆధార్ కార్డులో మీ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ అనుకుంటున్నారో దానిని కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. ప్రూఫ్ కోసం మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటున్న డాక్యుమెంట్స్ JPEG, PNG లేదా PDF ఫార్మాట్ లో అప్‌లోడ్ చేయాలి. మళ్ళీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మెసెజ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. 

ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా:

ముందుగా UIDAI వెబ్‌సైట్‌కి వెళ్ళి.. అక్కడ మై ఆధార్ అనే సెక్షన్‌ ను క్లిక్ చేయాలి. అక్కడే మనకి డౌన్‌లోడ్.. ఆధార్ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అది క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఆధార్ నెంబర్/ఎన్‌రోల్‌మెంట్ ఐడి/ వర్చువల్ ఐడి లో ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. అక్కడ వచ్చే క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే.. ఆధార్ కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ ఈ-ఆధార్ కార్డు పీడీఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ అవుతుంది.

Also Read; Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టం

Also Read: Arudra Help: నాడు జగన్‌ పట్టించుకోలేదు... నేడు ఆరుద్రను అక్కున చేర్చుకున్న చంద్రబాబు

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
Update your aadhaar card details for free of cost vn
News Source: 
Home Title: 

Aadhaar Card: ఆధార్ కార్డులో ఫ్రీగా మార్పులు.. ఎలా చేసుకోవాలంటే?

Aadhaar Card: ఆధార్ కార్డులో ఫ్రీగా మార్పులు.. ఎలా చేసుకోవాలంటే?
Caption: 
Aadhaar Card Update (source:FILE)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Aadhaar Card: ఆధార్ కార్డులో ఫ్రీగా మార్పులు.. ఎలా చేసుకోవాలంటే?
Vishnupriya Chowdhary
Publish Later: 
No
Publish At: 
Saturday, June 15, 2024 - 12:03
Created By: 
Vishnupriya Chowdhary
Updated By: 
Vishnupriya Chowdhary
Published By: 
Vishnupriya Chowdhary
Request Count: 
21
Is Breaking News: 
No
Word Count: 
348