RIMC Admissions: తెలుగు రాష్ట్రాల్లో ఏడో తరగతి చదువుతున్న బాలికలకు గుడ్ న్యూస్. డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ (RIMC Notification) విడుదలైంది.
ఆర్ఐఎంసీలో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్ కోసం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఆర్హతలు ఏమిటి? అప్లయి ఫీజు ఎంత? ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ వివరాలు గురించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
ఆర్ఐఎంసీ అధికారిక పోర్టల్‌లో నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారమ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి.
అప్లికేషన్ ఫారమ్స్తో పాటు.. ఎగ్జామ్ మోడల్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే వీలుంది.
Also read: Telangana Inter exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలను ఆపలేమన్న హైకోర్టు
దరఖాస్తుతో పంపాల్సిన డాక్యుమెంట్స్
- బర్త్ సర్టిఫికేట్
- నివాస ధృవీకరణ పత్రం
- ప్రస్తుతం చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ నుంచి ఫొటోతో కూడిన ధృవీకరణ పత్రం. ఇందులో స్కూల్ రికార్డ్స్ ప్రకారం పుట్టిన తేదీ వివరాల వంటివి ఉండాలి.
- ఆధార్ జిరాక్స్ జిరాక్స్ తప్పని సరి.
- రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
Also read: YS JAGAN Review:ఆ నియామకాలకు నవంబర్ 30 డెడ్‌లైన్ విధించిన జగన్
ఫీజులు..
జనరల్ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ- ఎస్టీ అభ్యర్థులు 555 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
అర్హతలు.
ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలనుకునే విద్యార్థినుల ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2022 జులై 1 నాటికి ఏడో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు టెస్ట్ రాసే సమయానికి పదకొండున్నరేళ్లు నిండి ఉండాలి. 13 ఏళ్లు దాటకూడదు. స్పష్టంగా చెప్పాలంటే.. 2009 జులై 2 కన్నా ముందు.. 2011 జనవరి 1 తర్వాత పుట్టిన బాలికలు ఎగ్జామ్ రాయడం కుదరదు.
Also read: Prakash raj MAA Controversy: తెరపైకి మళ్లీ 'మా' రగడ.. ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్
టెస్ట్ ఎలా ఉంటుంది?
ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్‌లకు సంబంధించి ఎగ్జామ్ (RIMC Admission test) ఉంటుంది. మొత్తం 400 మార్కుల పరీక్ష ఇది. ఇందులో మాథ్స్‌కు 200 మార్కులు, ఇంగ్లీష్‌కు 125 మార్కులు, జనరల్ నాలెడ్జ్‌కి 75 మార్కుల చొప్పున కేటాయించింది ఆర్ఐఎంసీ.
మ్యాథ్స్ పేపర్‌కు గంటన్నర సమయం ఉంటుంది. దీనిని హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలో రాయొచ్చు. జనరల్ నాలెడ్జ్ పేపర్‌కు గంట సమయం ఉంటుంది దీనిని కూడా ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో రాయొచ్చు. ఇంగ్లీష్ పేపర్‌కు రెండు గంటల సమయం ఉంటుంది.
తెలంగాణలో దరఖాస్తు చేసిన వారికి పరీక్ష కేంద్రం హైదరాబాద్‌లో ఉంటుంది. ఏపీలో విద్యార్థులకు పరీక్ష కేంద్రం విజయవాడ.
ఎంపిక విధానం..
మూడు పేపర్లలో కనీసం 50 శాతం చొప్పున మార్పులు సాధించాలి. 50 శాతం మార్కులు సాధించి అభ్యర్థులకు మెడికల్ టెస్ట్, వైవా నిర్వహించిన తర్వాత అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
Also Read : KBC 13: సెక్యూటరీ గార్డ్ కొడుకు రూ. కోటి గెలిచాడు
ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలు...
దరఖాస్తు పంపించేందుకు చివరి తేదీ.. నవంబర్ 15.
ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ- డిసెంబర్ 18
దరఖాస్తును తెలంగాణలో విద్యార్థులు హైదరాబాద్, నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు పంపాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు విజయవాడలోని ఆర్టీఏ కార్యాలయం దగ్గర ఉన్న ఏపీపీఎస్సీ కార్యాలయానికి దరఖాస్తును పంపించాల్సి ఉంటుంది.
Also Read : IPL 2022 new teams: ఐపిఎల్ 2022లో రెండు కొత్త ఫ్రాంచైజీలు.. Ahmedabad, Lucknow
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook