Tirumala Laddu Controversy: ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గతంలో చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వరుడి చుట్టూ రాజకీయం జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పరమ పవిత్రంగా భావించే తిరుమల వెంకన్న లడ్డూ చుట్టూ రాజకీయ వివాదాలు చెలరేగడం భక్తులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ లడ్డు వ్యవహారం ఎంతో మంది భక్తుల మనస్సులను గాయపరిచింది. ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. రోజు లక్షల మందికి పైగా భక్తులు ఆ యొక్క తిరుపతి వెంకన్నను దర్శించుకొని మహాద్భాగ్యాన్ని పొందుతారు. అలాంటి మహా ఆలయానికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడం ఎంటా అని భక్త సమాజం మనోవేదనకు గురవుతుంది. అసలు తిరుమల లడ్డుపై వివాదం రాజకీయ కోణంలో జరిగిందా లేక యాదృశ్చికంగా జరిగిందా అన్న అందరిలో ఒక అనుమానం మొదలైంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఎప్పుడూ జరగనంత అపవిత్రం జరిగిందని భక్తులు భాదపడుతున్నారు.
ఏపీలోని రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఆలోచనలే ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని వివాదంలోకి లాగిందా అన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వరుడి భక్తులలో జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా తిరుమల లడ్డు ఎందుకు వివాదంలోకి లాగబడింది..నిజంగానే తిరుమల లడ్డుల తయారీలో కల్తీ పదార్థాలు వాడుతున్నారా..అన్నది ఇప్పుడు భక్తుల మదిని తొలుస్తుంది. ఇన్ని రోజులుగా తిరుమల లడ్డులో కల్తీ నెయ్యిని వాడారా అది మనం మహా ప్రసాదంగా భావించి తీసుకున్నామా అని సర్వత్రా చర్చ జరగుతుంది. అసలు ఈ పాపం ఎవరిది. లడ్డుల తయారీలో అసలు ఏం వాడారు..ఎందుకింత రచ్చగా మారుతుంది. ఇప్పుడు భక్తులు దీని మదనే చర్చోప చర్చలు జరుపుతున్నారు. అసలు తిరుమల లడ్డు తయారీలో ఎలాంటి నిబంధనలు పాటిస్తారు. లడ్డూ తయారీ విధానాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు. లడ్డూ కల్తీ జరిగిందా లేదా అనేది ఎవరు నిర్ణయించాలి..అలాంటి వ్యవస్థలు ఏమైనట్లు అని భక్తులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు వివాదానికి కారణమైన నెయ్య విషయంలో ఎవరి పాత్ర ఏంటి అనేది నిగ్గూ తేలాల్చాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు..
శతాబ్దాలుగా తిరుమల లడ్డుకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకో ఏమో ఆ ప్రసాదం వాసన , రుచి మరెక్కడా దొరకదు అని భక్తుల విశ్వాసం. ఎన్నో పుణ్య క్షేత్రాల ప్రసాదం చూసి ఉంటాం. కానీ తిరుమల లడ్డుది మాత్రం ప్రత్యేకం. అందుకే భక్తుల ఆ తిరుమల లడ్డు కోసం ఎగబడుతుంటారు. వెంకన్న దర్శనం చేసుకున్న వాళ్లే కాదు ఆయన సన్నిధి నుంచి ప్రత్యేకంగా లడ్డు ప్రసాదాన్ని తెప్పించుకునేవారు కూడా ఎంతో మంది ఉంటారు.అలాంటిది ఇప్పుడు తిరుమల లడ్డుపై వివాదం చెలరేగడంపై భక్తులు సీరియస్ గా ఉన్నారు. లడ్డూ తయారీలో ఏదైనా తప్పు జరిగితే మాత్రం దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినపడుతుంది.
లడ్డూ తయారీలో తీవ్ర అపచారం జరిగింది అని ఏకంగా ఒక రాష్ట్ర సీఎం చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వును ఉపయోగించారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద వివాదాన్నే రాజేశాయి. ఇంతకీ చంద్రబాబు దేని ఆధారంగా ఈ ప్రకటన చేశారు..ఈ ప్రకటన చేసే ముందు తర్వా జరిగే పరిణామాలను ఆలోచించారా..ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన విషయాన్ని ఇలా ప్రకటించడం సరైందేనా అన్న చర్చ కూడా లేకపోలేదు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం, అంతేకాదు ఇది చాలా సున్నితమైన అంశం. దీనిని రాజకీయ కోణంలో కాకుండా భక్తుల ఆలోచనలకు అనుగుణంగా ఈ వ్యవహారాన్ని చూసి జాగ్రత్తగా డీల్ చేస్తే బాగుండేది అని భక్తుల అభిప్రాయం.
సీఎంగా , రాజకీయ నాయకుడిగా అపార అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాంటి ప్రకటనను ఆశామాషీగా చేసి ఉండరు. లడ్డూ తయారీలో ఏదో గోల్ మాల్ జరిగితేనే బాబు ఈ ప్రకటన చేసి ఉంటారనేది భక్తుల ఆలోచన. వెంటనే ఆలస్యం చేయకుండా లడ్డూ తయారీపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల ముందు ఏది నిజం ..అసలు లడ్డూ తయారీలో ఏం జరిగింది అన్న ప్రతి వాస్తవం బహిర్గత పరచాలనేది కోట్లాది భక్తుల మనోగతం. అంతే కాదు లడ్డూ తయారీలో ఏమాత్రం తప్పు జరిగినా దోషులను అదే స్థాయిలో కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. దీని వెనుక ఎంత మంది పెద్దలు ఉన్న వారిని వదలకుండా శిక్షించాలనే వాదన వెంకన్న భక్తుల నుంచి వినిపిస్తుంది. దీనిని రాజకీయకోణంలో చూడకుండా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు.
ఐతే మరోవైపు ఈ వ్యవహారం అసలు రాజకీయ రంగు పులుముకోవడంపై కూడా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయాన్ని బయటపెట్టకుండా లడ్డూ వ్యవహారంపై రాజకీయాలు చేయడంపై కూడా వెంకన్న భక్తులు సీరియస్ అవుతున్నారు. అన్నింటికీ మించి అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ జోక్యంపైనే అందరూ మండిపడుతున్నారు.టీటీడీలో అడుగడుగునా రాజకీయం జోక్యం ఉంటుంది. దీనిని నివారించాలనే డిమండ్ కూడా వినపడుతుంది. ఎప్పుడైతే రాజకీయ నాయకుల జోక్యం ఉంటుందో అప్పుడు ఇలాంటి వ్యవహారాలు జరుగుతుంటాయని ..అందుకే రాజకీయ జోక్యం లేకుండా తిరుమల పవిత్రతను కాపాడాలనే డిమాండ్ జోరుగా వినిపిస్తుంది.
కలియుగ ప్రత్యక్ష దైవంతో పెట్టుకున్నవారు ఎవరూ బాగపడలేదని.. ఆయనను రాజకీయాల్లోకి లాగితే దాని తీవ్రత త్వరలోను వారు అనుభవిస్తారని భక్తులు హెచ్చిరిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా వారు ఆ దేవ దేవుడి నుంచి తప్పించుకోలేరని ఆయన అన్నీ చూస్తున్నారని భక్తులు హితవు పలుకుతున్నారు. ఆ దేవదేవుడిని ప్రతిష్టను భంగపరిచేలా చేసిన వారు త్వరలో శిక్షింపబడడం ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తుంది.
Read more: Viral video: వావ్.. నెలల పసికందును అమ్మలా లాలించిన ఆవు.. ముచ్చట పడుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..
గతంలో నిందితుడు బాలికను చంపుతానని బెదిరించినట్లు తెలుస్తోంది. సమయానికి కోతులు అక్కడకు రాకపోయి ఉంటే నా కుమార్తె చనిపోయి ఉండేదని, బాలిక ఫ్యామిలీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులు.. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు సైతం నమోదు చేసి విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.