లోక్ సభలో గల్లా జయదేవ్ వర్సెస్ టీఆర్ఎస్ ఎంపీలు

                                  

Last Updated : Jul 20, 2018, 03:52 PM IST
లోక్ సభలో గల్లా జయదేవ్ వర్సెస్ టీఆర్ఎస్ ఎంపీలు

ఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలో టీడీపీ ఎంపీ గల్లా వ్యాఖ్యాలను టీఆర్ఎస్ ఎంపీలు తప్పుబట్టారు. దీనికి ప్రతిస్పందించిన టీడీపీ ఎంపీలు.. తాము మాట్లాడుతున్నప్పుడు టీఆర్ఎస్ ఎంపీల జోక్యం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళవాతావరణం నెలకొంది.

వివరాల్లోకి వెళ్లినట్లయితే ఈ ఉదయం అవిశ్వాస తీర్మానంపపై చర్చ జరిగినప్పుడు టీడీపీ తరఫున గల్లా జయదేవ్ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏకి పారేసిన గల్లా జయదేవ్ ఒకానోక సందర్భంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్రజాస్వామ్యంగా విభజించారని.. తలుపులు మూసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని మండిపడ్డారు. అలాగే తెలంగాణకు ఆస్తులు ఇచ్చి.. అప్పులను ఏపీకి ఇచ్చారని దుయ్యబట్టారు . ఈ సందర్భంగా ఆదాయాన్ని ఇస్తున్న పలు విషయాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు గల్లా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు స్పందిస్తూ రాజ్యాంగబద్ధంగా జరిగిన రాష్ట్ర విభజనను గల్లా  అప్రజాస్వామికం జరిగిందనడాన్ని ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. గల్లా చెబుతున్నట్లు ఆస్తులు తెలంగాణకు..అప్పలు ఏపీకి అడనం అన్యాయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని.. విభజన తర్వాత తమకు చెందిన  ఆస్తులే తమకు దక్కాయని పేర్కొన్నారు. గలా ఇలా అబద్ధాలు మాట్లాడం సరికాదని టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ ఎంపీలు లేచినిలడటం..మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం ఏర్పడింది

ఈ సందర్భంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ జోక్యం చేసుకొని  మీ సమయం వచ్చినప్పుడు మీరు  మాట్లాడాలంటూ టీఆర్ఎస్ ఎంపీలను కోరారు. అయినా టీఆర్ఎస్ ఎంపీలు శాంతించకపోవడంతో.. గల్లా కాసేపు ఆయన సీట్లో కూర్చుండి పోయారు. అనంతరం తన ప్రసంగాన్ని మళ్లీ కొనసాంచారు. 

Trending News