Vimana Venkateswara Swamy : తిరుమల గోపురం పై కొలువు ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి చరిత్ర … వింతే షాక్!!

Tirumala : తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే మనం తప్పకుండా దర్శించుకునే మరో దేవుడు అక్కడ గోపురం పైన ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి. దర్శనమై మనం బయటకి వచ్చి కొంచెం దూరం నడవగానే ఒక దగ్గర మెట్లుపై ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడకు వచ్చిన భక్తులు అందరూ ఆ మెట్లపై నిలబడి అక్కడ ఉన్న విమాన వెంకటేశ్వర స్వామికి భక్తితో నమస్కరిస్తూ ఉంటారు. అసలు విమాన వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఏమిటి ? వెనక ఉన్న చరిత్ర ఏమిటి అనేది ఒకసారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2023, 11:15 AM IST
Vimana Venkateswara Swamy : తిరుమల గోపురం పై కొలువు ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి చరిత్ర … వింతే షాక్!!

Vimana Venkateswara Swamy : వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎప్పుడు వెళ్ళినా గోపురం పై కచ్చితంగా విమాన వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటాం. తిరుమల శ్రీవారి గర్భాలయాన్ని ఆనంద నిలయం అంటారు. ఆ గర్భాలయం గోపురంపై వాయువ్య మూలన విమాన వెంకటేశ్వరుని పేరుతో చిన్న వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తాడు. కచ్చితంగా స్వామిని దర్శించుకున్న తర్వాత మనం విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటాము.

అయితే నిజానికి ఆలయాన్ని కట్టినప్పుడు విమాన వెంకటేశ్వరుని విగ్రహం అక్కడ పెట్టలేదు. ఆ తరువాత కాలంలో గోపురం పైకి విమాన వెంకటేశ్వరుని రూపం పెట్టడం జరిగింది. అసలు విమాన వెంకటేశ్వరుడు అంటే ఏమిటి? గోపురం పై ఉన్న విగ్రహానికి ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసుకుందామా.. తిరుమలలో ఆలయానికి సంబంధించి ఎన్నో పనులను విజయనగర పాలకులు తమ భుజస్కందాలపై వేసుకొని పూర్తి చేసిన విషయం తెలిసిందే.

విజయనగరాన్ని కృష్ణదేవరాయలు వంశీయులు పాలించే సమయంలో స్వామికి అనేక రకమైన బంగారు ఆభరణాలతో పాటు దేవాలయానికి పలు రకాల వస్తువులను సమకూర్చారు. అయితే స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించిన అటువంటి నగలను కొంతమంది అర్చకులు ధరించి తిరుమలలో తిరుగుతున్న విషయం గ్రహించాడు అప్పటి పాలకుడు సాళువ నరసింహారాయులు. దాంతో ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది.

రాజు గారికి కోపం వస్తే ఫలితం తీవ్రంగా ఉంటుంది కదా.. అందుకని ముందు వెనక ఆలోచించకుండా పట్టరాని కోపంతో ఆ వైష్ణవి అర్చకులని పాపం ఆలయ ప్రాంగణంలోనే నరికి చంపేశాడు. మరి బ్రాహ్మణ హత్య పాతకం అవుతుంది కదా. ఈ విషయం తెలుసుకున్న విజయనగర రాజ గురువు వ్యాసరాయుల వారు.. ఆ పాపం విజయనగర సామ్రాజ్యానికి అంటకూడదు అనే ఉద్దేశంతో 12 సంవత్సరాల పాటు పాప పరిహారకృతులను నిర్వహించారు.

అయితే ఈ కారణం చేత ఈ 12 సంవత్సరాలు స్వామి మూలవిరాట్ విగ్రహాన్ని భక్తులు దర్శించుకునే వీలు లేకుండా పోయింది. అందుకని ప్రత్యామ్నాయంగా ఆలయ గోపురంపై మూల మూర్తిని పోల్చినటువంటి వెంకటేశ్వర ని రూపాన్ని ప్రతిష్టించారు అనేది స్థల పురాణం. అలా ప్రతిష్టించిన ఆ వెంకటేశ్వరనే మనం విమాన వెంకటేశ్వర స్వామిగా నేడు తిరుమల ఆనంద నిలయ గోపురం పై దర్శించుకుంటున్నాము. అయితే దీనికి సంబంధించి మరొక కథనం కూడా ఉంది.

వైఖానస అర్చకుడి బాధ్యత నుంచి తొలగించిన తర్వాత.. ఇంకా అతని కుమారుడు చిన్నవాడు కావడంతో,మధ్వ సంప్రదాయానికి చెందిన వ్యాస రాయలవారు 12 సంవత్సరాల పాటు తిరుమలలో ప్రధాన అర్చకుడిగా వ్యవహరించారు. ఆ సందర్భంలో ఆయనే ఈ విమాన వెంకటేశ్వరుని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిపించారని కొందరు చెబుతారు. మరికొంతమంది అప్పటిలో గర్భగుడిలోకి ప్రవేశం లేని వారి కోసం వెంకటేశ్వర రూపాన్ని అలా గోపురం పై ప్రతిష్టించారని అని అంటారు. ఇలా విమాన వెంకటేశ్వర స్వామి గోపురం పై ఎలా వెలిశాడు అనే దానిపై చాలా కథలే ఉన్నాయి. 1982 ప్రాంతంలో మహా సంప్రోక్షణ జరిగిన సమయంలో విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం స్పష్టంగా కనిపించాలి అనే ఉద్దేశంతో విగ్రహం కు వెండి మకరతోరణాన్ని పెట్టించారు. అలాగే స్వామిని గుర్తుపట్టే విధంగా అక్కడ ఒక బాణం గుర్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. గోవిందా ..గోవిందా..

ఇది కూడా చదవండి: Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు, ఏపీలో ఇక వర్షాలు

ఇది కూడా చదవండి: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా గిఫ్ట్.. డీఏ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News