Vaikunta Ekadasi 2023: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రేపు (మంగళవారం) స్వామి బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏకాదశి సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్చకులు రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా మూలవిరాట్టును వస్త్రంతో కప్పుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆలయ శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారని చెప్పారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ.. నైవేధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక పూజలు అనంతరం భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఈ పూజల నేపథ్యంలో రేపు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం సిఫార్సు లేఖలు స్వీకరించట్లేదన్నారు.
గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న విధంగానే ఈ ఏడాది కూడా వైకుంఠ ద్వార దర్శనం 11 రోజులపాటు కల్పించనుంది టీటీడీ. 2023 జనవరి 2వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ద్వార దర్శనాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు 80 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నిరకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసి.. శ్రీవాణి, ఎస్ఈడీ టిక్కెట్లు, ఎస్ఎస్డీ టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు "మహా లఘు దర్శనం" కల్పించనున్నారు.
రూ.300 కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం దర్శనానికి సంబంధించి రోజుకు 25 వేల టికెట్లు విడుదల చేస్తారు. 10 రోజులకు కలిపి మొత్తం 2.50 లక్షల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. 2023 జనవరి కోటాలోనే ఈ టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అదేవిధంగా తిరుమల స్థానిక భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు తిరుపతిలో 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు.
Also Read: Coronavirus: కరోనా ముప్పుపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
Also Read: Winter Storm in US: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. 34కి చేరిన మృతుల సంఖ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook