Chandrababu Campaigning: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలలో సమయం ఉంది. ఈ క్రమంలో అధికార పార్టీ వివిధ రకాల వ్యూహాలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటే చంద్రబాబుపై కేసుల కారణంగా టీడీపీ వెనుకబడింది. ఇప్పుడు బెయిల్ రావడంతో తిరిగి ప్రచారం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
దాదాపు రెండు నెలలకు పైగా నిలిచిపోయిన రాజకీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు తెలుగుదేశం అదినేత చంద్రబాబు సిద్ధమౌతున్నారు. ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజులు రిమాండ్‌లో ఉన్నారు. దాంతో టీడీపీ ప్రచార కార్యక్రమం నిలిచిపోయింది. తండ్రి అరెస్ట్ కావడంతో తనయుడు లోకేశ్ పాదయాత్ర ఆగిపోయింది. అదే సమయంలో జనసేన పార్టీతో పొత్తు కుదిరినా పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా ఏ రాజకీయ కార్యక్రమాలు చేపట్టలేదు. దాంతో ప్రతిపక్షాల నుంచి బలమైన కార్యక్రమమేదీ మూడు నెలల్నించి లేకుండా పోయింది.
ఇప్పుడు చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఈ నెల 29 నుంచి తిరిగి ప్రచారాన్ని ప్రారంభించాలని ఆయన యోచిస్తున్నారు. హైకోర్టు కూడా బహిరంగ సభలు, సమావేశాల్లో పొల్గొనే అనుమతి ఇవ్వడంతో తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైకోర్టు బెయిల్ ఇచ్చినా ఇంకా వివిధ అడ్డంకులు మాత్రం తొలగలేదు. మరికొన్ని ఇతర కేసుల్లో పీటీ వారెంట్ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది.
రానున్న రోజుల్లో ప్రచార కార్యక్రమాన్ని తెలుగుదేశం-జనసేన కలిసి సంయుక్తంగా చేపట్టేందుకు కూడా ప్లానింగ్ జరుగుతోంది. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టోపై స్పష్టమైన ప్రకటన రానుంది. ఉమ్మడి మేనిఫెస్టో నిర్ధారణయ్యాక ఆ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన-టీడీపీ కలిసి ప్రయత్నించనున్నాయి. పొత్తు కుదిరిన నేపద్యంలో రెండు పార్టీ మధ్య ఎలాంటి విబేధాలు లేవనే సంకేతాలు ప్రజల్లో పంపించాల్సి ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయనున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో వైద్య చికిత్సతో చంద్రబాబు ఆరోగ్యం మెరుగుపడింది. అటు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కేటరాక్ట్ సర్జరీ కూడా పూర్తయింది. ఇప్పుడికి తిరిగి ప్రజల్లో చేరువయ్యే కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. అదే సమయంలో నిలిపివేసి యువగళం పాదయాత్రను లోకేశ్ తిరిగి ప్రారంభిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Chandrababu Campaigning: ఈ నెల 29 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం, ర్యాలీలు