Junior Civil Judge: ఏపీ పోటీ పరీక్షల్లో తెలంగాణ యువతికి ఫస్ట్‌ ర్యాంక్‌.. అలేఖ్య అరుదైన ఘనత

AP High Court Results: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పోటీ పరీక్షల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. అద్భుత ప్రతిభ కనబర్చి నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఏపీ హైకోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై అరుదైన ఘనత సాధించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 28, 2024, 04:47 PM IST
Junior Civil Judge: ఏపీ పోటీ పరీక్షల్లో తెలంగాణ యువతికి ఫస్ట్‌ ర్యాంక్‌.. అలేఖ్య అరుదైన ఘనత

Junio Civil Judge: ఆంధ్రప్రదేశ్‌ జూనియర్ సివిల్‌ జడ్జి పోటీ పరీక్షలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ యువతి పరిమి అలేఖ్య (25) ఎంపికైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్‌ జడ్జి పరీక్ష రాసి అత్యధిక మార్కులు సొంతం చేసుకుని మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. హన్మకొండకు చెందిన మాధవీలత, పరిమి మనోజ్‌ కుమార్‌ దంపతుల కుమార్తె అలేఖ్య. హైదరాబాద్‌లోని‌ పెండేకంటి న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ చదివింది. 2022లో న్యాయశాస్త్ర విభాగంలో పట్టా అందుకున్న అలేఖ్య ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ రెండో సంవత్సరం చదువుతోంది. 

రంగారెడ్డి జిల్లా కోర్టులో సీనియర్ సివిల్‌ జడ్జిగా అలేఖ్య తల్లి మాధవీలత విధులు నిర్వహిస్తున్నారు. తల్లిని స్ఫూర్తిగా తీసుకున్న అలేఖ్య న్యాయవాది కావాలనే లక్ష్యం విధించుకుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సివిల్‌ జడ్జి నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అలేఖ్య కష్టపడి చదివి ఇప్పుడు ఆ పరీక్షల్లో తొలి ర్యాంకును సాధించింది. అద్భుతమైన ప్రతిభ కనబర్చిన అలేఖ్య ఇక ఏపీ హైకోర్టులో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వహించనుంది. తమ కుమార్తె అలేఖ్య మొదటి ర్యాంకును సాధించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Also Read: Seethakka: కేటీఆర్‌ పెంపుడు కుక్కల కోసం రూ.12 లక్షలా? మంత్రి సీతక్క విస్మయం

Also Read: Lavanya Tripathi: విశాఖ బీచ్‌లో చెత్తాచెదారం ఏరివేసిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News