Andhra Pradesh: గుంటూరు జిల్లాలో దారుణం.. టీడీపీ నేత హత్య

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురయ్యారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్‌, టిడిపి (Telugu Desam Party) నేత పురంశెట్టి అంకులు (55) ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

Last Updated : Jan 4, 2021, 12:27 PM IST
Andhra Pradesh: గుంటూరు జిల్లాలో దారుణం.. టీడీపీ నేత హత్య

TDP Leader murdered in Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురయ్యారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్‌, టిడిపి (Telugu Desam Party) నేత పురంశెట్టి అంకులు (55) ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కత్తితో గొంతు కోసి అతి దారుణం (TDP Leader murdered) గా హతమార్చారు. దాచేపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో రాత్రి 8గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. 

అంకులు (Puramsetti Ankulu) ను ఆదివారం రాత్రి పంచాయితీ కోసమని పిలిచి ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసినట్లు పలువురు పేర్కొంటున్నారు. టీడీపీ నేత పురంశెట్టి అంకులు పెదగార్లపాడు గ్రామానికి 15 ఏళ్ల పాటు సర్పంచ్‌గా సేవలందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంకులు ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులు (AP Police) కారు డ్రైవరు, పలువురిని విచారిస్తున్నారు. Also Read: Uttar Pradesh: 25కి చేరిన మృతుల సంఖ్య.. ముగ్గురి అరెస్ట్

సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు నాయకులు, అక్కడ టీడీపీ నాయకులు చేరుకోని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైఎస్ఆర్‌సీపీ (YSRCP) నేతలే అంకులును హత్య చేశారని ఆరోపించారు. అయితే రాష్ట్రంలో మరో టీడీపీ నేత దారుణ హత్యకు గురికావడం రాష్ట్రం (Andhra Pradesh)లో సంచలనంగా మారింది.

Also Read: Farmers Protest: నేడు ఏడోసారి కేంద్రం, రైతుల మధ్య చర్చలు.. ఫలించేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News