ఇవే మా ఆస్తులు, అంతస్తులు : నారా లోకేష్

దశాబ్ద కాలం నుండి ప్రతి ఏడాది తమ కుటుంబ సభ్యుల ఆస్తులు ప్రకటిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 

Last Updated : Feb 20, 2020, 07:46 PM IST
ఇవే మా ఆస్తులు, అంతస్తులు : నారా లోకేష్

అమరావతి : దశాబ్ద కాలం నుండి ప్రతి ఏడాది తమ కుటుంబ సభ్యుల ఆస్తులు ప్రకటిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ..  స్వర్గీయ నందమూరి తారకరామా రావు ట్రస్టును మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభించారని, గత సంవత్సరంతో పోలిస్తే 
 నారా చంద్రబాబు నాయుడు ఆస్తులు రూ.87 లక్షలు పెరిగాయని ప్రకటించారు. 

చంద్రబాబు ఆస్తి రూ.9 కోట్లు ఉండగా, అప్పులు రూ.5 కోట్ల 13 లక్షలు న్నాయని, కాగా నారా భువనేశ్వరి ఆస్తులు రూ.50 కోట్లు అని, లోకేష్ ఆస్తి రూ.24 కోట్లు అని, బ్రాహ్మిణి ఆస్తి రూ.15.68 కోట్లు అని, దేవాన్ష్ ఆస్తి రూ.19.42 కోట్లుగా ఉందని వెల్లడించారు. నారా భువనేశ్వరి 23 ఏళ్లుగా హెరిటేజ్‌లో పని చేస్తున్నారన్నారని, నా పేరిట ఉన్న షేర్లను బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చానన్నారు. గత సంవత్సరం నారా లోకేష్ ఆస్తి రూ.27 కోట్ల నుంచి రూ.24 కోట్లకు తగ్గిందని ప్రకటించారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News