AP Elections: ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో తెలుగు దేశం, జనసేన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ సందర్భంగా ఆయా వర్గాలకు డిక్లరేషన్ ప్రకటిస్తూ.. అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామంటూ కీలకమైన హామీలు ఇస్తున్నాయి. తాజాగా బీసీ వర్గాలకు సంబంధించి ఉమ్మడి డిక్లరేషన్‌ను టీడీపీ, జనసేన విడుదల చేశాయి. ఆయా పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ డిక్లరేషన్‌ను విడుదల చేసి ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.
Also Read: Revanth Reddy Temple: సీఎంగా ఎన్నికై 100 రోజులు కూడా కాలే.. అప్పుడే రేవంత్ రెడ్డికి గుడి
గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ – జనసేన సంయుక్తంగా మంగళవారం 'జయహో బీసీ' సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. అతడిని ఆహ్వానించిన చంద్రబాబు అనంతరం పవన్‌కల్యాణ్‌తో కలిసి బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. వెనుకబడిన వర్గాల దశ దిశ మార్చేందుకు డిక్లరేషన్ అని చంద్రబాబు తెలిపారు. బీసీల డీఎన్‌ఏ తెలుగుదేశంలో ఉందని ప్రకటించారు. 153 బీసీ కులాల అభివృద్ధికి జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. బీసీలందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషన్‌లో ఉన్న కీలక అంశాలు ఇవే..
Also Read: KCR: రేవంత్ రెడ్డికి హామీల అమలు చేతకాక నాలుక మడతేసి అబద్ధాలు: కేసీఆర్
బీసీ డిక్లరేషన్ ప్రకటనలో కీలకమైన పది అంశాలు
1. బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ అమలు చేస్తాం. రూ.3 వేలు ఉన్న పింఛన్‌ను రూ.4 వేలకు పెంపు.
2. ప్రత్యేక రక్షణ చట్టం: జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలు హత్యకు గురయ్యారు. బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుంచి రక్షణ కోసం ‘ప్రత్యేక రక్షణ చట్టం’ తీసుకొస్తాం.
ఎ) సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడుతాం.
3. బీసీ ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్) ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం.
ఎ) వైసీపీ ప్రభుత్వం రూ.75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించింది. అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
4. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ను వైసీపీ ప్రభుత్వం 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి 16,800 మందిని పదవులకు దూరం చేసింది. అధికారంలోకి వచ్చాక 34 శాతం బీసీ రిజర్వేషన్లు పునరుద్దరణ.
ఎ) చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.
బీ) అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ అమలు.
సీ) తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం.
5. ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తాం
ఎ) జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం.
బి) దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.
సి) స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం.
డి) జగన్ రెడ్డి ‘ఆదరణ’ వంటి 30 పథకాలు రద్దు చేశారు. రూ.5 వేల కోట్లతో ‘ఆదరణ’ పరికరాలు ఇస్తాం.
ఈ) మండల/నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్, ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం.
ఎఫ్) జగన్ రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం.
6. చట్టబద్దంగా కుల గణన నిర్వహిస్తాం.
7. చంద్రన్న బీమా రూ.10 లక్షలతో పునరుద్దరిస్తాం. పెళ్లి కానుకలు రూ.లక్షకు పెంపు
8. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.
9. విద్యా పథకాలు అన్నీ పునరుద్దరిస్తాం
ఎ) నియోజకవర్గాల్లోని గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం.
బి) షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం.
సి) పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్దరిస్తాం.
డి) స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంభిస్తాం.
10. బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తాం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి