Nara Lokesh Corona: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కరోనా పాజిటివ్

Nara Lokesh Corona: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొవిడ్ మహమ్మారి బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని ట్విట్టర్ ద్వారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. అయినా హోం క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 04:42 PM IST
    • టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు కరోనా పాజిటివ్
    • లక్షణాలు లేకున్నా హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ట్వీట్
    • తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి
Nara Lokesh Corona: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కరోనా పాజిటివ్

Nara Lokesh Corona: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొవిడ్‌ బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ట్విట్టర్ ద్వారా లోకేష్ వెల్లడించారు. తనకు ఎలాంటి లక్షణాలూ లేవని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా తనని కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నారా లోకేష్ సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ క్షేమంగా ఉండాలని లోకేష్ ట్విటర్​లో పేర్కొన్నారు.

పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని డిమాండ్

కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని గుర్తు చేశారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన అన్నారు. 

15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదన్న లోకేష్.. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడోద్దని ఏపీ ప్రభుత్వానికి హితవు పలికారు. గత పది రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, గడిచిన పది రోజుల్లోనే రోజుకి 500 కేసుల నుండి 5 వేల కేసులు నమోదు అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఈ సమయంలో స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. 

ఏపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు నారా లోకేష్. తల్లిదండ్రులను మరింత మానసిక ఆందోళనకు గురి చేయకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని కోరారు. తక్షణమే స్కూల్స్​కి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లోకేష్ డిమాండ్‌ చేశారు. 

Also Read: AP Corona cases: ఏపీలో 5 వేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు!

Also Read: ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు పొడగిస్తారా.. మంత్రి ఆదిమూలపు సురేష్ రియాక్షన్ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News