ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ వ్యాఖ్యలపై వైసీపీకి టీడీపీ సవాల్

                              

Last Updated : Mar 21, 2019, 01:46 PM IST
ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ వ్యాఖ్యలపై వైసీపీకి టీడీపీ సవాల్

హోదాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పీవీపీపై విమర్శల దాడి టీడీపీ ముమ్మరం చేస్తోంది. తాజాగా ఈ అంశంపై టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. వైసీపీకి ప్రత్యేక హోదాపై  చిత్తశుద్ధి లేదని... ఈ విషయాన్ని తమ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్ధి పీవీపీ చేత చెప్పించారని విమర్శించారు. జగన్ కు హోదాపై చిత్తశుద్ధి ఉంటే పీవీపీపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విజయాడలో జరిగిన సీఐఐ సదస్సులో పీపీవీ ఏపీ ఎకానమిక్ డెవెలప్ మెంట్ పై సుదీర్ఘంగా ప్రగంగించారు. ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో  ప్రత్యేక హోదా ఓ బోరింగ్‌ సబ్జెక్ట్ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది. 

వైసీపీకి మూడో స్థానం ఖాయం

ధనబలంతో జగన్ రాజకీయాలను నడపాలని చూస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. డబ్బుంటే చాలు టికెట్ గ్యారెంటీ అన్న రీతిలో జగన్ వ్యహరిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రజా సమస్యల అవసగాహన లేని వాళ్లకు టికెట్లు ఇస్తున్నారని..విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా పీవీపీకి టికెట్ కేటాయింపే ఇందుకు నిదర్శనమన్నారు. జగన్ తీరుతో రాష్ట్రంలో వైసీపీ మూడో స్థానంలో వచ్చినా ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదని ఎద్దేవ చేశారు

వైవేకా హత్య పై అసత్య ప్రచారం

వివేకా మరణంపై వైఎస్ వివేకా కుమార్తె సునీతా వ్యాఖ్యలను రాజేంద్ర ప్రసాద్ స్వాగతించారు. విచారణ ఎలాంటిదైనా నిష్పాక్షంగా నిర్వహించాలని ఆమె కోరుతున్నారు. కానీ వైపీసీ మాత్రం సీబీఐ చేత వివచారణ చేపట్టాలనే డిమాండ్ చేస్తోంది చేస్తుంది. వారికి రాష్ట్ర పోలీసులపైనమ్మకం లేన్నట్లు ఉందన్నారు. వైసీపీ అసత్య ప్రచారం..విచారణపై ప్రభావితం చూపేలా ఉందని..ఇప్పటికైనా విచారణకు సహరిస్తే అసలు దోషులను పట్టుకోవచ్చని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు
 

Trending News