AP Elections CBN Review: మరోసారి పొత్తు పెట్టుకోవడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నవారికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. పొత్తులో భాగంగా కోల్పోయే సీట్లలో స్థానిక నాయకులు పార్టీని వీడే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా చోట్ల పార్టీకి చెందిన కీలక నాయకులు పచ్చ కండువా వదిలేసి వెళ్తున్నారు. సైకిల్‌ను కాదని ఇతర పార్టీల్లో చేరుతున్నారు. రోజురోజుకు పార్టీని వీడేవారి సంఖ్య పెరుగుతుండడంతో చంద్రబాబు నివారించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు గ్యారంటీ అంటూ ఓ కీలక ప్రకటన చేశారు. పొత్తుకు సహకరించిన వారికి భవిష్యత్‌లో అద్భుత అవకాశాలు ఉంటాయని ప్రకటించారు.
Also Read: Elections Survey: దేశ ప్రజలకు PINEWZలో అద్భుత ఛాన్స్.. ఎన్నికలపై మీ అభిప్రాయం తెలిపే సదావకాశం
సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో విస్తృత పర్యటనలు చేస్తున్న చంద్రబాబు ఈ క్రమంలోనే శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పొత్తుల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు సహకరించిన నాయకులకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. పొత్తులు ఉండడంతో అందరికీ టికెట్లు ఇవ్వలేమనే విషయాన్ని గుర్తు చేశారు. టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచించారు. మనస్తాపం చెంది ఇతర నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. పార్టీని నమ్ముకున్నవారికి కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Sonia Assets: సోనియా గాంధీకి సొంత కారు లేదంట.. ఇక మిగతా ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..
ఈ సందర్భంగా వచ్చేది తమ ప్రభుత్వమేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇప్పుడు పొత్తులకు సహకరించే నాయకులకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామనే భరోసా ఇచ్చారు. పొత్తుల వలన కొందరు త్యాగాలు చేయాల్సి వస్తుందని, ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచించారు. పార్టీని నమ్ముకున్న వారికి కచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని పార్టీ నాయకులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. పరోక్షంగా ఎవరూ పార్టీని వీడొద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు. సీఎం జగన్‌తో విసిగిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీలో చేరతామని వస్తున్నారని చంద్రబాబు తెలిపారు. అలా వచ్చేవారిలో మంచివారు, పార్టీకి ఉపయోగపడతారనుకునే వాళ్లనే ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు కూడా అలాంటి చేరికలను స్వాగతించాలని, వారితో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న 'రా కదలిరా' సభలు ముగిశాక మరో ప్రజాచైతన్య యాత్రకు శ్రీకారం చుడుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.
ఎన్నికలపై పార్టీ నాయకత్వానికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు దాదాపు 50 రోజులే సమయం ఉండడంతో అందరూ ఉత్సాహంగా.. చురుగ్గా పనిచేయాలని సూచించారు. బీసీ సాధికార సభలకు వస్తున్న అనూహ్య స్పందనతో ప్రతి నియోజకవర్గంలో వాటిని నిర్వహించాలన్నారు. బీసీల అభ్యున్నతి కోసమే ఏర్పడిన టీడీపీ ఆవిర్భవించిందని తెలిపారు. ఎన్నికలకు కలిసికట్టుగా పనిచేసి సత్తా చాటుదామని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook