YS Jagan Nadu Nedu : ఏపీ విద్యా వ్యవస్థ.. 'నాడు నేడు'ని మెచ్చుకున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు

YS Jagan Nadu Nedu Programme వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు విద్యా కార్యక్రమం మీద స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు ప్రశంసలు కురిపించాడు. ఏపీ విద్యార్థులు త్వరలోనే ప్రపంచ స్థాయిలో రాణిస్తారని కొనియాడాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 02:24 PM IST
  • ఏపీ సీఎం మీద స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు
  • నాడు నేడు విద్యా విధానంపై ఆరా
  • స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడి కామెంట్లు వైరల్
YS Jagan Nadu Nedu : ఏపీ విద్యా వ్యవస్థ.. 'నాడు నేడు'ని మెచ్చుకున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు

YS Jagan Nadu Nedu Programme ఏపీ సీఎం వైఎస్ జగన్ చేపట్టే సంక్షేమ పథకాలు అందరికీ తెలిసిందే. ఆయన చేపట్టిన నాడు నేడు విద్యా కార్యక్రమం మీద ఇప్పుడు స్విట్జర్లాండ్‌ మాజీ దేశాధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిస్‌ చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జెనీవాలో ఐరాస (ఐక్యరాజ్య సమితి)లో ‘ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ కార్యక్రమంలో స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు పాల్గొన్నాడు. ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఫోరం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలోనే ఆయన నాడు నేడు గురించి మాట్లాడారు.

కరోనా వల్ల విద్యా వ్యవస్థ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. అంతా డిజిటల్ చేసేందుకు ప్రయత్నించారు. ఇదే విషయాన్ని ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విద్యా వ్యవస్థ పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపాడు. అయితే ఇండియాలోని ఒక్క ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని ప్రశంసించాడు.

పేద విద్యార్థుల కోసం సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయని ప్రశంసించారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేశారని, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నేలా ఉన్నాయని మెచ్చుకున్నారు. కొంత కాలం తర్వాత ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆకట్టుకున్న ఏపీ స్టాల్‌  
ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఫ్యూచర్‌ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పథకాల స్టాల్‌ అందరినీ ఆకట్టుకుంది. స్వయంగా దేశాధ్యక్షుడే ఏపీ విద్యా విధానాలపై ప్రశంసలు వ్యక్తం చేయడంతో స్విట్జర్లాండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ పాట్రిసియా దన్జీ స్టాల్‌ను విజిట్ చేశాడట. నాడు–నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలవుతున్న తీరు, విద్యా ప్రమాణాలు మెరుగుదల.. తదితర విషయాలపై ఏపీ గవర్నమెంట్‌ను ఆయన పొగిడారు.

డిజిటల్‌ లెర్నింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్‌లో భాగంగా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌ల పంపిణీ, పాఠశాలల ఆధునికీకరణ, డిజిటల్‌ బోర్డుల ఏర్పాటు, ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధన తదితర కార్యక్రమాలన్నీ పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు. హైజెనిక్‌ బాత్రూమ్స్‌ అండ్‌ టాయిలెట్స్, లైబ్రరీ, యూనిఫాం, ప్లేగ్రౌండ్స్, బుక్స్‌, స్టేషనరీ కిట్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందని మెచ్చుకున్నాడు. ‘ఈక్విటబుల్‌ ఎడ్యుకేషన్‌ యాక్సెస్‌ టు ఆల్‌’ విధానం చాలా నచ్చిందని ప్రశంసలు కురిపించాడు.

Also Read:  Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్

Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్‌.. యాంకర్ జబర్దస్త్ రిప్లై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News