Supreme Court: విశాఖ రుషి కొండ నిర్మాణాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రుషికొండలో నిర్మాణాలను చేపట్టుకోవచ్చని స్పష్టం చేసింది. ఒకే అంశంపై రెండు చోట్ల పిటిషన్లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం అనుమతులు మంజూరు చేసింది. రుషికొండపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఇటీవల ఎన్జీటీ స్టే ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది.
తాజాగా వీటిపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈసందర్బంగా ఎన్జీటీ తీరును కోర్టు తప్పుపట్టింది. రుషికొండలో నిర్మాణాలకు పచ్చజెండా ఊపింది. కేవలం రఘురామకృష్ణరాజు లేఖ ఆధారంగానే ప్రాజెక్ట్‌పై స్టే ఇవ్వడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. ముందుగా చదును చేసిన ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో యథావిధిగా పనులు కొనసాగించుకోవచ్చని తేల్చి చెప్పింది.
తవ్వకాలు చేసిన ప్రదేశంలో నిర్మాణాలు చేయవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈసందర్భంగా తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదని పేర్కొంది. ఈకేసు విచారణను హైకోర్టు బదిలీ చేసింది. ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధే ఎక్కువని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం సరికాదని విచారణలో భాగంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు, ఎన్జీటీ పరస్పర విరుద్ధ ఆదేశాలు గందరగోళానికి గురి చేస్తాయని..హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అప్పటివరకు ఎన్జీటీలో విచారణ జరపరాదని ఆదేశించింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈకేసు విచారించింది.
Also read:India Corona: దేశంలో కరోనా ఆందోళన కల్గిస్తోందా..? యాక్టివ్ కేసులు ఎన్నంటే..!
Also read:Ambati Comments: చంద్రబాబు వల్లే పోలవరానికి ఈదుస్థితి..చర్చకు సిద్ధమన్న అంబటి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook