YSRCP ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై రాళ్లదాడి

గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీలో రాజకీయ వేడి రాజుకుంది. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, నరసారావు పేట ఎంపీల మధ్య భగ్గుమన్న విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విడదల రజనీ కారుపై రాళ్ల దాడి జరగడం కలకలం రేపుతోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 21, 2020, 09:00 AM IST
YSRCP ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై రాళ్లదాడి

చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రాజకీయ వేడి మొదలైంది. అధికార వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఎమ్మెల్యే కారుపై రాళ్లతో దాడి జరగడం, కారు అద్దాలు ధ్వసం కావడం స్థానికంగా రాజకీయ వేడి మరోసారి రాజుకుంది. అసలేం జరిగిందంటే..  మహా శివరాత్రి సందర్బంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కుటుంబసభ్యులు విడదల వారి ప్రభను సుప్రసిద్ద కోటప్పకొండలో సమర్పించేందుకు వెళ్లారు. పురుషోత్తమ పట్నం నుంచి వచ్చి కోటప్పకొండలో సమర్పించి తిరిగి వెళ్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.

Also Read: అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం తర్వాత ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు!

ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో ఎమ్మెల్యే విడదల రజనీ భర్త కుమార్, ఆమె మరిది గోపీ కారులో ఉన్నట్లు తెలుస్తోంది. గోపీకి స్వల్పగాయాలైనట్లు సమాచారం. ఎమ్మెల్యే ఉన్నారని భావించి ఆమె ప్రత్యర్థి వర్గాలు దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. తమపై దాడి చేసింది ప్రత్యర్థి వర్గీయులేనని ఎమ్మెల్యే రజనీ, గోపీ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని వర్గాల మధ్య ఇటీవల గొడవ జరిగిన విషయం తెలిసిందే. రెండ్రోజుల కిందట  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌ ఇంటికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వెళ్లారు. అనంతరం మహాశివరాత్రి సందర్భంగా బైరా సంఘమిత్ర వారు ఏర్పాటు చేసిన ప్రభను సందర్శించారు. ఆహ్వానం పంపినా తమ ప్రభల వద్దకు రాకపోవడంతో ఎమ్మెల్యే రజనీ వర్గీయులు మండిపడ్డారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ కాన్వాయ్‌ను అడ్డుకుని ప్రశ్నించడంతో ఉద్రికత్త తలెత్తింది. 

Also Read: జీతం నుంచి డబుల్ PF కట్ అవుతుందా.. EPFO రూల్స్‌లో ఏముంది?

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News