Chegondi Harirama jogaiah: రాష్ట్రంలోని 175 సీట్లలో కేవలం 24 సీట్ల దక్కించుకుని తృప్తి పడటాన్ని చేగొండి హరిరామజోగయ్య ప్రశ్నిస్తున్నారు. దేహీ అని ఇచ్చిన సీట్లు తీసుకోవడం పొత్తు ధర్మమా అని అడుగుతూ పవన్ కళ్యాణ్‌కు ఘాటైన లేఖ రాశారు.
తెలుగుదేశం-జనసేన పొత్తు, ప్రకటించిన అభ్యర్ధులు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి అసంతృప్తిని కల్గిస్తుందో కానీ జనసేనలో మాత్రం ఆగ్రహానికి కారణమౌతోంది. కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలే దక్కడంపై జనసేన మద్దతుదారులకు రుచించడం లేదు. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా సాక్షిగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలుస్తూ సలహాలు సూచనలు ఇస్తూ లేఖలతో సంచలనం కల్గించే మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య సైతం పొత్తు-సీట్ల సర్దుబాటుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు
ఈ సీట్ల ఒప్పందాన్ని ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. ఒకరు ఇవ్వడం మరొకరు దేహీ అనడం పొత్తు ధర్మమా అని నిలదీసారు. జనసేనకు రాష్ట్రంలో 24 సీట్లకు మించి గెలిచే స్థోమత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అని వ్యాఖ్యానించారు. అసలు సీట్ల పంపకం ఏ ప్రాతిపదికన చేశారో చెప్పాలన్నారు. అన్ని కులాల జనాభా ప్రాతిపదికన జరిగిందా అని ఆగ్రం వ్యక్తం చేశారు.
జనసైనికులకు కావల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదని, పవన్‌కు అధికారమనేది గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుత సంక్షోభానికి చంద్రబాబు-వపన్ కళ్యాణ్ చెరో రెండున్నరేళ్ల సీఎం పదవి చేపట్టడమే పరిష్కారమని మరోసారి సూచించారు. అటు మంత్రి పదవులు కూడా రెండు పార్టీలకు సమానంగా ఉండాలన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ 24 సీట్లకు అంగీకరించడం జనసేన అభిమానులకు నచ్చడం లేదన్నారు.
Also read: Janasena-Tdp: సీట్ల సర్దుబాటుపై జనసైనికుల్లో తీవ్ర అసంతృప్తి, ఓటు బదిలీపై ప్రభావం పడుతుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook