Sankranti Special Trains: తెలుగు వారితోపాటు హిందూవులు చేసుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగకు ప్రతి ఒక్కరూ తమ స్వగ్రామాల్లో పండుగ చేసుకునేందుకు వెళ్తుంటారు. అయితే పండుగకు వెళ్లేందుకు మూడు నెలల నుంచే ప్రణాళికలు వేసుకుంటారు. వారితో రెగ్యులర్ రైళ్లు నెల కిందే బుక్కయ్యాయి. ఇప్పటికిప్పుడు ప్రణాళిక చేసుకునేవారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. సంక్రాంతికి పండుగకు ముందు నుంచి అంటే 9వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ రైళ్లకు సంబంధించిన బుకింగ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. అయితే ప్రత్యేక రైళ్లు ఏమిటి? ఏ మార్గాల్లో వేశారు? సీట్లు ఎలా రిజర్వ్ చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన.. 'జైలుకు పంపిన వారిపై కక్ష తీర్చుకుంటా'
తెలుగు వారు చేసుకునే అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌వాసులు గ్రామాలకు వెళ్తుంటారు. వారి కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది. హైదరాబాద్‌లోని నాంపల్లి, కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల మీదుగా ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగనున్నాయి. ఈ రైళ్లు 9, 10, 11, 12 తేదీల్లో రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక రైళ్లకు భారీ డిమాండ్ ఉండే నేపథ్యంలో ప్రయాణికులు ముందే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: New Year Gift: పేదలకు సీఎం చంద్రబాబు కొత్త సంవత్సర గిఫ్ట్.. రూ.24 కోట్లు విడుదల
ప్రత్యేక రైళ్లు ఇవే!
కాచిగూడ- కాకినాడ పట్టణం రైలు (07653)
జనవరి 9, 11వ తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది.
కాకినాడ పట్టణం-కాచిగూడ (07654)
జనవరి 10, 12 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
ఈ రైళ్లు మల్కాజిగిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్ల కోట స్టేషన్‌లలో ఆగుతుంది.
హైదరాబాద్ (నాంపల్లి)- కాకినాడ పట్టణం (07023)
జనవరి 10వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు నాంపల్లి స్టేషన్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణం జనవరి 11తేదీన ఉంటుంది.
11వ తేదీన కాకినాడ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) చేరుకుంటుంది.
ఈ రైలు మార్గంలో స్టేషన్లు
సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం పట్టణం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్లలో ఈ రైళ్లు నిలుస్తాయి. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే స్టేషన్‌లలో రైళ్లు ఆగుతాయి.
బుకింగ్ ఇలా..
సంక్రాంతి పండుగ కావడంతో పెద్ద ఎత్తున స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు అయినా కూడా భారీగా డిమాండ్ ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈ రైళ్లకు రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లకు మీ సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లి రిజర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్ వేదికగా రైల్వే శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా పేటీఎం, ధ్రువీకరణ పొందిన ఇతర యాప్‌ల సహాయంతోనైనా బుక్ చేసుకునే సదుపాయం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.