Ruia Ambulance Mafia: ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద దారుణం జరిగింది. ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ సిబ్బంది మానవత్వాన్ని మరిచిన ఘటన జరిగింది. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి చెందిన ఓ బాలుడు మృతి చెందగా.. ఆ మృతదేహాన్ని తమ అంబులెన్స్ లోనే స్వగ్రామానికి తీసుకెళ్లాలని డ్రైవర్లు పట్టుబట్టారు. దీంతో చేసేదేమి లేక బాలుని తండ్రి బైక్ పై మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ హృదయవిదారక ఘటనను చూసిన పలువురు స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే?
రుయా ఆస్పత్రిలో ప్రత్యక్ష సాక్ష్యుల ప్రకారం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఓ బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ బాలుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు బంధువులు ఓ ప్రైవేట్ అంబులెన్స్ ను ఆస్పత్రికి తీసుకొచ్చారు.
అయితే మృతదేహాన్ని తమ రుయా ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ లలోనే తీసుకెళ్లాలని డ్రైవర్లు అడ్డుపడ్డారు. దీంతో చనిపోయిన బాలుని తండ్రి చేసేదేంలేక ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. దీనికి కారణమైన రుయా అంబులెన్స్ డ్రైవర్స్ పై స్థానికులు తిట్టిపోస్తున్నారు.
రుయా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత, అరెస్టు..
ఈ క్రమంలో రుయా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మృతుని కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అంబులెన్స్ మాఫియా వెనుక ఉన్న అధికారులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దీనికి సంబంధించిన ఆరుగురిని అరెస్టు చేశారు.
Also Read: AP CPS Issue: మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, సీపీఎస్‌పై కమిటీ
Also Read: World Malaria Day: మలేరియా నివారణ చర్యల్లో ఏపీ భేష్... కేంద్రం నుంచి పురస్కారం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.