రోహిత్ వేముల తల్లికి ఎక్స్ గ్రేషియా అందజేత

ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్ధి రోహిత్ వేముల తల్లికి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎక్స్ గ్రేషియా అందజేసింది.

Last Updated : Feb 21, 2018, 03:13 PM IST
రోహిత్ వేముల తల్లికి ఎక్స్ గ్రేషియా అందజేత

ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి, హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ ఇచ్చిన రూ.8 లక్షల నష్టపరిహారాన్ని స్వీకరించారు. న్యాయవాదులు నష్టపరిహారాన్ని (ఎక్స్ గ్రేషియా) తీసుకోమని సలహా ఇచ్చారని రోహిత్ వేముల తల్లి రాధా వేముల అన్నారు.  

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రీసర్చ్ స్కాలర్ రోహిత్ వేముల, జనవరి 17, 2016న హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేరుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యూనివర్శిటీ తనకు వ్యతిరేకంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుందని మనస్తాపం చెంది రోహిత్ సూసైడ్ చేసుకున్నాడు.

రోహిత్ ఆత్మహత్య విషయంలో నాటి కేంద్ర కార్మిక శాఖ బండారు దత్తాత్రేయ.. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి లేఖరాయడం పెద్ద రాజకీయ దుమారాన్నే లేపింది. పార్లమెంట్ లో స్మృతి ఇరానీ రోహిత్ వేముల ఆత్యహత్యపై వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే..!! 

Trending News