Liquor Sales in Telangana and AP: కొత్త ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి వరకు ఆటపాటలతో కాలక్షేపం చేసి.. 12 గంటలకు కేక్ కట్ చేసి.. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మందు బాబులు ఫుల్ మత్తులో మునిగి తేలారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. రెండు ప్రభుత్వాలకు ఒక్క రోజులోనే కోట్ల ఆదాయం వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో న్యూ ఇయర్ వేళ భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు జరిగాయి. శనివారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.127 కోట్ల లిక్కర్ సేల్ జరిగింది. డిసెంబర్ 29న రూ.72.3 కోట్లు, డిసెంబర్ 30న రూ.86 కోట్ల అమ్మకాలు జరిగాయి. సాధారణ రోజుల్లో రూ.72 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరుగుతుండగా.. డిసెంబర్ 31 సందర్భంగా లిక్కర్ సేల్ ఓ రేంజ్‌లో పెరిగింది.
అదేవిధంగా తెలంగాణలోనూ మద్యం ఏరులై పారింది. తెలంగాణ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. శనివారం ఒక్కరోజే అబ్కారీ శాఖకు రూ.215 కోట్ల 74 లక్షల ఆదాయం వచ్చింది. అమ్మకాలు తగ్గినప్పటికీ ధరలు పెరిగిన కారణంగా ఆదాయాన్ని ఆర్జించింది అబ్కారీ శాఖ. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల నుంచి 2 లక్షల 17 వేల 444 లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి. దాదాపు లక్ష 28 వేల 455 కేసుల బీర్ కేసుల అమ్మకాలు జరిగాయి.
కేవలం హైదరాబాద్‌లోనే రూ.37 కోట్ల 68 లక్షల ఆదాయం వచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటినా మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంతో భారీ ఆదాయం వచ్చింది. నూతన సంవత్సరం మొదటి రోజు ఆదివారం కూడా మద్యం అమ్మకాలు భారీగా జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు హైదరాబాద్‌లో భారీగా నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 5,819 మంది వాహనదారుల లైసెన్సులను రద్దు చేశారు రవాణా శాఖ అధికారులు.
Also Read: Team India: ఈ ఏడాది టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. ఆ సిరీస్ గెలిస్తే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook